పెదాలకు లిప్‌స్టిక్ రుద్దుతున్నారా.. అయితే డేంజరే!

ఈరోజుల్లో మినిమం మేకప్ లేనిది ఎవరూ బయటకు రావడం లేదు. ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందరూ సౌందర్య ప్రేమికులైపోయారు. అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మేకప్ చేసుకుంటారు. అందులో మేకప్‌ను, మహిళలను విడదీసి చూడలేం. మేకప్‌లో ముఖాన్ని అందంగా చూపించడంలో పెదవులదే అగ్రస్థానం. అందుకే చాలామంది ముఖానికి లైట్ మేకప్ వేసుకున్నా.. పెదాలకు మాత్రం లిప్‌స్టిక్ మరిచిపోరు. లిప్‌స్టిక్‌తో ముఖాన్ని  స్టైలిష్‌గా కనిపించేందుకు నిత్యం సరికొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. లిప్‌స్టిక్ పెట్టుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా  ముఖ్యమంటున్నారు నిపుణులు. లిప్‌స్టిక్ పెదవుల అందాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో.. ఆరోగ్యానికి కూడా అంతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

లిప్‌స్టిక్ ద్వారా పెదవులపై రసాయన పొర ఏర్పడుతుంది. దీని ద్వారా అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అయితే.. మార్కెట్లలో లభించే లిప్‌స్టిక్‌లు రసాయనాలతో తయారు చేస్తారు. ఇవి మీ ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మీకు లిప్‌స్టిక్‌ ఎక్కువగా ఉపయోగించే అలవాటుంటే.. అన్ని పరిశీలించిన తరువాత,  మంచి బ్రాండ్ చూసి కొనాలని సూచిస్తున్నారు. మార్కెట్లో చౌకగా దొరికే లిప్‌స్టిక్‌ను ఎప్పుడూ కొనొద్దని.. వాటిని అస్సలు వాడొద్దని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. లిప్‌స్టిక్ వాడటం వల్ల అందంగా కనిపించడం వరకు ఓకే.. కానీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ఇప్పుడు చూద్దాం!

  • లిప్‌స్టిక్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..
    లిప్‌స్టిక్‌ వేసుకున్న తర్వాత ఆకలేసినప్పుడు ఏదైనా తినడం కామన్. ఆ సమయంలో ఫుడ్‌తో పాటు లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు కూడా మన కడుపులోకి వెళ్తాయి. లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు శరీరానికి చాలా హానికరం.
  • లిప్‌స్టిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే, అందులో ఉండే లెడ్, అల్యూమినియం, కాడ్మియం, క్రోమియం, మెగ్నీషియం మీ శరీరంలో లోపలికి వెళ్తాయి. ఇవి మీ నాడీ వ్యవస్థ పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.
  • లిప్‌స్టిక్‌లో ఉండే అల్యూమినియం ఆరోగ్యానికి అనేక విధాలుగా హానికరం. ఇది పొట్టలోకి చేరితే అల్సర్‌కు దారి తీస్తుంది.
  • లిప్‌స్టిక్‌లో ఉండే మూలకాలు శరీరంలోని ఫాస్ఫేట్‌ను తగ్గిస్తాయి.

  • లిప్‌స్టిక్‌లోని సీసం సామర్థ్యం, జ్ఞాపకశక్తి, IQ స్థాయిల మీద ప్రభావం చూపిస్తాయి.
  • లిప్‌స్టిక్‌లోని మూలకాలు శరీరంలోకి ప్రవేశించడం వల్ల చికాకు పెరుగుతుంది.
  • లిప్‌స్టిక్‌లోని క్రోమియం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.