పెరిగిన వెండి ధరలు..నిలకడగా బంగారం రేటు

 

బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్న రేట్లు తగ్గినప్పటికీ బులియన్ మార్కెట్లో ఇవాళ్టి ట్రేడింగ్ లో ఎలాంటి మార్పు లేదు. బుధవారం మినహా గత 8 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర నిలకడగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48 వేలు ఉండగా..ఇవాళ కూడా అదే రేటు ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 44,000 ఉంది.

వెండి రేటు
వెండి రేటు మాత్రం పెరిగింది. కేజీ వెండి శుక్రవారం రూ. 300 తగ్గింది. దీంతో రూ.73,400 వద్ద కొనసాగుతోంది.