ఒక పెద్ద మనిషి అలా కూడా చేస్తాడా.. ఈయన చేసిన పనికి ఏడ్చేశాను.. షారుఖ్ పై చిన్మయి షాకింగ్ కామెంట్స్..!

Singer Chinmayi Shocking Comments On Shahrukh Khan
Singer Chinmayi Shocking Comments On Shahrukh Khan
Singer Chinmayi Shocking Comments On Shahrukh Khan
Singer Chinmayi Shocking Comments On Shahrukh Khan

కాస్టింగ్ కౌచ్ పేరు ఎత్తగానే సౌత్ లో గుర్తేచ్చే పేరు చిన్మయి. ఈవిడొక స్టార్ సింగర్. సమంతకి ఎన్నో సినిమాల్లో డబ్బింగ్ చెప్పి మాయచేసిన బ్యూటీ. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. పలువురు సినీ పెద్దలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మరింత ఫెమస్ అయ్యింది చిన్మయి. ముక్యంగా తమిళనాడు దిగ్గజ సినీ రచయిత వైరిముత్తుపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి అతన్ని ఇండస్ట్రీ నుండి బహిష్కరించేలా చేసింది. దాంతో ఆమె పేరు ఇండియాలో ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అప్పటినుండి సోషల్ మీడియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. నెగిటీవ్ గా కాదు పాజిటీవ్ గానే. చెన్నై ఎక్స్ ప్రెస్ లో తానూ పాడిన టిట్లి మెలోడీ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ పాటని స్టేజ్ పై పాడుతుండగా ఆ సూపర్ స్టార్ చేసిన ఒక పనికి ఏడుపొచ్చిందంటూ అప్పటి అనుభవాన్ని గుర్తుచేసుకుంది చిన్మయి.

‘ఇది చాల ఏళ్లనాటి విషయం. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో టిట్లీ సాంగ్ పాడాను.. ఆ సమయంలో ఓ సూపర్ స్టార్ నా పేరును ట్యాగ్ చేసి అద్భుతంగా పాడావ్ అని ప్రశంసించారు. అలా నన్ను మెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో అతనే. ఇలా చాల సందర్భాల్లో నన్ను ఆయన మెచ్చుకున్నాడు. ఒకసారి స్టేజిపై టిట్లి పాట పాడినాక.. ఆయన నా గురించి ట్వీట్ చేశాడు. చిన్మయి పాట అచ్చం ప్రేమ లాగే ఉంటుంది అంటూ కామెంట్స్ చేశాడు. ఆయన ప్రతీ చోటా నా పాట, నా గాత్రం గురించి గొప్పగానే చెప్పారు. ఆ సమయంలో నేను ఓ పక్క నవ్వుతున్నాను.. మరో పక్క ఏడ్చేస్తున్నాను. అదంతా కూడా మా అమ్మ గమనిస్తూ వచ్చింది. ఇలా నాలో గమనించిన ప్రతి విషయాన్నీ మా అమ్మ ఒక లెటర్ రూపంలో రాసి ఆ సూపర్ స్టార్ కి ట్యాగ్ చేసింది. ఆ తరువాత నేను చెన్నై ఎక్స్‌ప్రెస్ ఆడియో లాంచ్‌కు వెళ్తే అక్కడ మా అమ్మ రాసిన ప్రతి పదాన్ని ఆయన గుర్తుపెట్టుకుని నాతో చెప్పాడు.

ఆ తరువాత సడెర్న్ గా మా అమ్మతో మాట్లాడాలి అన్నాడు. నేను జోక్ చేస్తున్నాడేమో అనుకుంటే నా ఫోన్ లాక్కొని 15నిముషాలు మా అమ్మతో మాట్లాడాడు. తాను ప్రపంచంలోనే గొప్ప బిడ్డని కన్నానేమో అన్నంత రేంజిలో ఆమెతో నా గురించి ముచ్చటించాడు ఆ సూపర్ స్టార్. నేను అవాక్కయ్యాను. సూపర్ స్టార్స్ ఇలా కూడా మాట్లాడతారా అని షాక్ అయ్యాను. కోన్ని రోజుల తరువాత ఆయన చెన్నైకి వచ్చారు. అక్కడ ఎంతో మంది ఉన్నా కూడా మా అమ్మ దగ్గరికి వచ్చి కాళ్లు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఏదేమైనా కానివ్వండి.. ఆయన కుటుంబం ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. త్వరలో ఆయన అన్ని సమస్యల నుండి బయటపడాలి’ అంటూ షారుఖ్ ఖాన్ గురించి చెప్తున్నట్టు చెప్పకుండా.. అప్పట్లో తన గురించి షారుఖ్ చేసిన ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేసింది చిన్మయి. దాంతో ఈ బ్యూటీ చెప్పింది షారుఖ్ ఖాన్ గురుంచి అని అందరికి అర్ధం అయ్యింది.