ప్రముఖ సింగర్ తండ్రి హత్య.. బెంగళూరులో దొరికిన మృతదేహం

crime

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ హరిణి కుటుంబం వారం రోజుల క్రితం నుంచి కనిపించడం లేదంటూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగళూరులోని రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఆయనను ఎవరైనా చంపి రైల్వే ట్రాక్ మీద పడేశారా.. లేక ఆయనే రైలు నుంచి పడిపోయి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఏకే రావు గత కొన్నేళ్లుగా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా పదవీ విరమణ పపొందిన ఆయన సుజనా ఫౌండేషన్ కు సీఈవోగా పనిచేస్తున్నారు. అయితే.. వారం నుంచి ఆయన ఆఫీస్ కి రాలేదని అక్కడ పనిచేసే వారు చెప్పారు.

మూడురోజుల క్రితం రైల్వే ట్రాక్ మీద ఏకేరావు మృతదేహాన్ని పోలీసుల గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లు పనిచేయలేదు. వారం నుంచి కనిపించకుండా పోయిన హరిణి, ఆమె కుటుంబ సభ్యులు ఏకే రావు మృతదేహం దొరికిందన్న సమాచారం తెలుసుకొని బెంగళూరు రైల్వే పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.