సింగర్ హరిణి తండ్రి ఆత్మహత్య.. ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు

Singer Harini's father commits suicide

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ హరిణి కుటుంబం వారం రోజుల క్రితం నుంచి కనిపించడం లేదంటూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగళూరులోని రైల్వే ట్రాక్ మీద దొరికింది. ఆయనను ఎవరైనా చంపి రైల్వే ట్రాక్ మీద పడేశారా.. లేక ఆయనే రైలు నుంచి పడిపోయి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏకే రావు ఆత్మహత్య కేసుపై నమోదైన ఎఫ్ఐఆర్ లో పలు కీలక అంశాలు బయటికొచ్చాయి. ‘‘ఈ నెల 23 తేదీన యాలహంకా, రాజనా కుంటు రైల్వే స్టేషన్ మధ్య ఏకే రావు మృత దేహం గుర్తించినాం. నాందేడ్ ఎక్స్ ప్రెస్ కో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలం కు చేరుకున్నాం. యాలహంకా రైల్వే ట్రాక్ పైన బోర్ల పడి ఉన్న మృత దేహాన్ని గుర్తించాము. తల ఎడమ వైపు ఆరు సెంటిమీటర్లు గాయం అయినట్లు గుర్తిచాము. ఎడమ చేతికి , గొంతుపై గాయాలు ఉన్నట్లు గుర్తించాము. ఘటన స్థలం లో చాకు, కత్తి, బ్లెడ్ ని స్వాధీనం చేసుకున్నాం. పోస్టు మార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించాము. మృతుడు దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాము.  మృతుడు ఏకే రావు కుమారుడు వచ్చి, తన తండ్రి మృత దేహం అని గుర్తించాడు.’’ అని ఎఫ్ఐఆర్ లో పోలీసులు వెల్లడించారు.

ఓ ప్రాజెక్ట్ పని మీద అప్పుడప్పుడు ఏకే రావు బెంగళూర్ వెళ్లేవాడని, ఈ నెల 8వ తేదీన బెంగళూరుకు వెళ్లిన ఏకే రావు తన కొడుకు ఇంట్లో ఉన్నాడు. ఈ నెల 23వ తేదీన ఏకే రావు భార్య బెంగళూర్ లో ఉన్న కుమారుడు కి ఫోన్ చేసింది. యశ్వంత్ పూర్ రైల్వే పోలీస్ నుండి తనకు ఫోన్ వచ్చిందని, రైల్వే ట్రాక్ పై తన భర్త చనిపోయాడు అని పోలీసులు చెప్పారని కుమారుడు కి సమాచారం ఇచ్చింది.

ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఏకే రావు ను వేరే ప్రాంతంలో హత్య చేసి రైల్వే ట్రాక్ పై పడేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి న్యాయ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ రూరల్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ముందుగా 174 ( C)   CRPC సెక్షన్ ల ప్రకారం కేసు నమోదు చేశామని, ఆ తర్వాత ఐపీసీ 302, 201 కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

ప్రముఖ సింగర్ తండ్రి హత్య.. బెంగళూరులో దొరికిన మృతదేహం