పెళ్ళికి ముందు అలా అన్నారు.. పెళ్లి తరువాత మొత్తం మారిపోయారు.. సునీత షాకింగ్ కామెంట్స్..!

Singer Sunitha Sensational Comments On her Second Marriage
Singer Sunitha Sensational Comments On her Second Marriage
Singer Sunitha Sensational Comments On her Second Marriage
Singer Sunitha Sensational Comments On her Second Marriage

టాలీవుడ్ సింగర్స్ లో సునీత క్రేజ్ నెక్ట్స్‌ లెవెల్లో ఉంటుంది. టీనేజీ కూతురున్నా.. ఇంకా సునీతకి యూత్ లో మంచి ఫాలోయింగే ఉంది. బ్యూటీ విత్ ట్యాలెంట్ కాంబినేషన్ తో.. నెగిటీవ్ గానో.. పాజిటీవ్ గానో.. సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ లో ఉంటుంది సింగర్ సునీత. ఇక రీసెంట్ గా రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తతో రెండవ వివాహం చేసుకున్న తరువాత అయితే సునీత సోషల్ మీడియా క్రేజ్ రెట్టింపు అయిపోయింది. ఈ తరుణంలో ఒక మీడియా సంస్థకి లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన పెళ్లి తరువాత జరిగిన మార్పులపై షాకింగ్ కామెంట్స్ చేసింది సింగర్ సునీత. పెళ్ళికి ముందు.. పెళ్లి తరువాత ఎలాంటి మార్పులు వచ్చాయో ఓపెన్ గా కామెంట్స్ చేసింది సునీత. మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకోబోతున్నట్లు.. ఎప్పుడైతే సునీత రెండో పెళ్లి పై ప్రకటన చేశారో అప్పటినుంచి నేటి దాకా ఈ ఇష్యూ చర్చల్లో నిలుస్తూనే ఉంది. అయినప్పటికీ అవేవీ పెద్దగా పట్టించుకోకుండా, నెగెటివ్ కామెంట్స్‌ని తిప్పికొడుతూ సునీత తన మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారు.

ఇక మీడియాతో సునీత మాట్లాడుతూ.. ‘నా కోసం.. నా పిల్లల కోసం..మా కుటుంబం అనుమతితో నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నాకు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. నా కుటుంబ మద్దత్తు సంపూర్ణంగా ఉంది. అందుకే అప్పట్లో నా పెళ్లిని వ్యతిరేకించిన వారెవ్వరిని పట్టించుకోకుండా నాకు నచ్చిన పనిని చేసుకుంటూ పోయాను. పెళ్లికి ముందు చాలా మంది చాలా రకాలుగా నాతో ఏవేవో అన్నారు. కానీ పెళ్లి తరువాత మొత్తం మారిపోయారు. కొందరికి నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అందుకే వాళ్లంతా నాతో పెళ్లి తరువాత మాట్లాడటం మానేశారు. నాకు తెలుసు వారంతా అలా మారిపోతారని. అందుకే నేను వారి గురించి పట్టించుకోను’ అంటూ తనపై, తన పెళ్లిపై వచ్చిన నెగిటీవ్ కామెంట్స్ కి బోల్డ్ రియాక్షన్ ఇచ్చింది సింగర్ సునీత. ‘ఇక నా పెళ్ళికి నా కుటుంబం అంగీకారముంది. అలాంటప్పుడు నేను నా పెళ్లి గురించి ఇతరుల అనుమతి ఎందుకు తీసుకోవాలి’ అంటూ సింగర్ సునీత చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.