తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ‘సిరివెన్నెల’: జస్టీస్ ఎన్వీ రమణ

justice nv ramana mours ti sirivennela

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ సంతాపం తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు అని తెలిసి ఎంతో విచారించానన్నారు.

తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రిగారి ప్రవేశం పాటకు ఊపిరులూదింది. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో సీతారామశాస్త్రి.. తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారన్నారు.

సాహితీ విరించి సీతారామశాస్త్రికి శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, లక్షలాది అభిమానులకు తన సానుభూతిని తెలియజేశారు.