వినియోగదారులకు రాఖీ పౌర్ణమి కానుక.. స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు

Slightly reduced petrol prices
Slightly reduced petrol prices
Slightly reduced petrol prices
Slightly reduced petrol prices

రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు ఆయిల్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. గత కొద్ది రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ధరలు 35 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ మీద 20 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గాయి. ధరలు తగ్గిన తర్వాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.64, డీజిల్ 89.07కి చేరాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66, డీజిల్ ధర 96.64, చెన్నైలో పెట్రోల్ రూ.99.32, డీజిల్ 93.66, కలకత్తాలో పెట్రోల్ రూ.101.93, డీజిల్ రూ. 92.13, బెంగళూరులో పెట్రోల్ రూ.105.13, డీజిల్ రూ.94.49 గా ఉన్నాయి. తాగా ధరల తగ్గింపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.69, డీజిల్ ధర రూ.97.15కి చేరింది.