పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో దారుణం

murder

పండుగ వేళ  సంగారెడ్డి జిల్లాలో ఆందోల్ మండలం మన్సాన్ పల్లి లో  దారుణం చోటు చేసుకుంది. చాకలి లక్ష్మయ్య (60) ను అతని కొడుకు కిష్టయ్య (42) గొడ్డలితో తలపై నరికి దారుణంగా హత్య చేశాడు.

మద్యానికి, జల్సాలకు బానిసై డబ్బుల కోసం తండ్రిని దారుణంగా నరికి చంపిండు. గతంలో చాకలి కిష్టయ్యకు మూడు వివాహాలు అయినప్పటికీ ఇతని వేధింపులు తట్టుకోలేక ముగ్గురు భార్యలు విడాకులు తీసుకున్నారని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.