కన్నతండ్రికి కంటతడి : ఆస్తి పంచలేదని చిత్రవధ చేసిన కొడుకులు - TNews Telugu

కన్నతండ్రికి కంటతడి : ఆస్తి పంచలేదని చిత్రవధ చేసిన కొడుకులుయూపీ రాష్ట్రంలోని మ‌ధుర‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆస్తి పంపకాలకు ఒప్పుకోలేదని క‌న్న‌తండ్రిని (62) మంచానికి గొలుసుతో క‌ట్టేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. యూపీ రాష్ట్రంలోని రోడ్డు ర‌వాణా సంస్ధ‌లో డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న బాధితుడిని మ‌ధుర జిల్లా శిహోర గ్రామంలో తండ్రి పట్ల క‌న్న కొడుకులే కర్కషంగా ప్రవర్తించారు. ఆస్తిని పంపకాలకు ఒప్పుకోలేదని ఇంట్లోని ఓ గ‌దిలో మంచానికి చైన్‌తో క‌ట్టేసి వేధింపుల‌కు గురిచేశారు.

బాధితుడిని స‌వాల్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. సింగ్ సీనియ‌ర్ సిటిజ‌న్ హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను మంచం మీదే మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న చేయాల్సిన దుస్ధితి క‌ల్పించార‌ని తండ్రి వాపోయారు. తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. మనవళ్ల సాయంతో చైన్ తెంచుకోని త‌ప్పించుకుపోయాన‌ని ఆయన తెలిపారు. జూన్ 25న స‌వాల్ సింగ్ సీనియ‌ర్ సిటిజ‌న్స్ హెల్ప్ లైన్‌కు కాల్ చేయ‌డంతో ఈ దారుణం వెలుగుచూసింది.