సిరీస్ గెలుపు దిశగా సౌతాఫ్రికా

South Africa batsmen Peterson

న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో ఆతిథ్య జట్టు సౌతాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. చివరిరోజు ఆటలో కీలక సౌతాఫ్రికా బ్యాట్ మెన్ పీటర్సన్ (82) ఔటయ్యాడు. శార్దూల్ వేసిన 47 ఓవర్‌లో రెండో బంతికి పీటర్సన్ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

ప్రస్తుతం 51 ఓవర్లకు సౌతాప్రికా 162/3తో నిలిచింది. బావుమా (6), డస్సెన్‌ (19) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 50 పరుగులు కావాలి. ఇండియన్ బౌలర్లలో బుమ్రా, శార్డుల్, షమీ తలా ఓ వికెట్ తీశారు.

మూడు టెస్టుల ఈ సిరీస్ లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో ఉన్న విషయం తెలిసిందే.