దక్షిణాఫ్రికాదే చివరి వన్డే.. పోరాడి ఓడిన భారత్

southafrica cricket

మూడో వన్డేలోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌పై నాలుగు పరుగుల తేడాతో సౌతాఫ్రికా టీం విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

అంతకుముందు 288 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్(9) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శిఖర్ ధావన్(61), విరాట్ కోహ్లీ(65) సౌతాఫ్రికా బౌలర్లను అడ్డకొని బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. ఇంతలో ఇద్దరు పెవిలియన్ చేరడం, పంత్(0) గోల్డెన్ డక్ అవ్వడం మ్యాచ్ ను మలుపుతిప్పింది. శ్రేయస్ అయ్యర్(26), సుర్యకుమార్ యాదవ్(39),దీపక్ చాహర్(54) విజయం కోసం చివరి వరకు పోరాటం చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, పెహ్లూవాయో 3, ప్రిటోరియస్ 2, మంగళ, మహారాజ్ తలో వికెట్ తీశారు.