తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పై ఈటెల విమర్శలు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ - TNews Telugu

తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పై ఈటెల విమర్శలు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ఈటెల రాజేందర్ తనంతట తాను చేసిప తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈటెల సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరమన్నారు. కేసీఆర్ కు- ఈటెలకు ఆరేళ్లుగా గ్యాప్ ఉంటే మంత్రి పదవి ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్ , కాలేరు వెంకటేష్ తో కలిసి టీఆర్ ఎస్ ఎల్పీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ అనే వ్యక్తి- టీఆరెస్ పార్టీ లేకుంటే ఈటెల ఎక్కడ ఉండే వారన్నారు. ఈటెల పై నమ్మకంతో ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈటెల నచ్చని- మెచ్చని పార్టీకి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈటెల ఆలోచించకోవాలన్నారు.

హరీష్ రావు ను కాదని ఈటెలకు ఫ్లోర్ లీడర్ పదవి కేసీఆర్ ఈటెలకు ఇచ్చారని, టీఆరెస్ పార్టీకి ముందు- పార్టీలోకి వచ్చిన తర్వాత ఈటెల ఏంటో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. వరవరరావు ను జైల్లో పెడితే కేసీఆర్ పరామర్శించలేదు అన్న ఈటెల.. ఆయను జైల్లో పెట్టిన పార్టీలో ఎందుకు జాయిన్ అవుతున్నారు? అంటూ విమర్శించారు.

కేసీఆర్ చేసిన తప్పు ఏంటో ఈటెల రాజేందర్ ప్రజలకు చెప్పాలన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యే గా టీఆరెస్ పార్టీ- కేసీఆర్ లేకుండా ఈటెల పేరుమీద గెలిచారా? అని ప్రశ్నించారు.  ఈటెల రాజేందర్ ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని, హుజురాబాద్ లో అభివృద్ధి చేసే పార్టీకి- అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు పోటీ అన్నారు.

తెలంగాణ అభివృద్ధికి సహకరించని పార్టీ బీజేపీ అని, ఐదేళ్లు దూరం పెట్టి మారేందుకు అవకాశం ఇచ్చినా ఈటెలలో మార్పు రాలేదన్నాడు. ఈటెలకు- కేసీఆర్ కు గ్యాప్ ఉన్నా మంత్రి పదవి ఇచ్చి సీఎం కేసీఆర్ ఈటెలను గౌరవించారన్నాడు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిన ఘనత ఈటెలకు కేసీఆర్ కట్టబెట్టారన్నారు. బీజేపీ భూ స్థాపితం అవుతుందని అన్న ఈటెల- ఎందుకు బీజేపీ లో చేరుతున్నారని ప్రశ్నించారు. ఈటెల అన్న కురుక్షేత్ర యుద్ధంలో ఈటెల పాత్ర ఏంటో చెప్పాలన్నారు.

ఈటెల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ను గొప్పతనాన్ని పొడిగిన విషయం గుర్తించుకోవాలన్నారు. ఈటెల వ్యక్తిగతంగా జరిగిన తప్పును నిరూపించుకోలేక ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఈటెల బీజేపీలో చేరి పెట్రోల్-డీజిల్ తగ్గిస్తారా? పోలవరం తరహాలో తెలంగాణకు జాతీయస్థాయి ప్రాజెక్టు రప్పిస్తారా? ఇన్నేండ్లు ఈటెలను పెంచి పోషించిన కేసీఆర్ పై అబండాలు వెయ్యడం కరెక్ట్ కాదన్నారు.

ఈటెలకు మర్యాద ఇవ్వలేదు అంటే ఎలా? మంత్రి పదవి ఇచ్చారు చాలదా? అని ఎంపీ బండ ప్రకాష్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతకడానికి పథకాలు కేసీఆర్ తెచ్చారని, బడుగుబలహీన వర్గాల ప్రజలు ఇవ్వాళ ఆత్మగౌరవంతో ఉన్నారన్నాడు.