శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి: మేయర్ విజయ లక్ష్మి

Mayor-Gadwal-Vijayalakshmi

శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో శానిటేషన్, వ్యాక్సినేషన్, ఇంజినీరింగ్, ట్యాక్స్, టౌన్ ప్లానింగ్ విభాగాల పై సమీక్షించారు.

ఈ సందర్భంగా  మేయర్ మాట్లాడుతూ.. శానిటేషన్, టాయిలెట్స్ నిర్వహణ పై సర్కిల్ సహాయ వైద్య అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలని శానిటేషన్ వర్కర్స్ హాజరు, టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉందో లేవో తరుచూ పరిశీలన చేయాలని ఆదేశించారు.

అవెన్యూ ప్లాంటేషన్, థీమ్ పార్క్ ఇతర పనులలో కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. దోమల నివారణకు చర్యల్లో బాగంగా ఫాగింగ్, స్లమ్ ఏరియాలో దృష్టి పెట్టాలని వారం వారం నిర్దేశించిన ప్రదేశాలలో ఫాగింగ్ చేయాలని ఆదేశించారు.

రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ గుర్తించిన పెద్ద పెద్ద వ్యాపారస్తుల పై దృష్టి సారించాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇంజనీరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, పూర్తయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను  వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

నిర్దేశించిన ప్రకారంగా టాక్స్ వసూలు చేయాలన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. స్ట్రీట్ లైట్ విషయంలో పిర్యాదులు వస్తే వెంటనే  పరిష్కరించాలన్నారు. శానిటేషన్ , స్ట్రీట్ లైట్  అంశాల పై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. వచ్చే సంవత్సరం జనవరి మాసం నుండి ప్రతి శుక్రవారం గ్రీన్ డే గా  పాటిస్తామని చెప్పారు.

జోన్ లో  విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని. దాన్ని  దృష్టిలో పెట్టుకొని  8 లింక్ రోడ్లను చేపట్టడం జరిగింది. జాతీయ రహదారి, ముంబై  హైవే నుండి వచ్చే ట్రాఫిక్ శేరీలింగం పల్లి నుండి మోహిదిపట్నం వెళ్లే ట్రాఫిక్ ను లింకు రోడ్ల ద్వారాను మళ్ళించే అవకాశం  ఉందన్నారు. జోన్ లో చేపట్టిన 485 టాయిలెట్ ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు.

100 శాతం వాక్సినేషన్ పూర్తవ్వలని ఇంటి ఇంటికి సర్వే చేసి వాక్సిన్ వేసుకొని జాబితా ప్రకారంగా  వాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని వీలుంటే మొబైల్ వ్యాక్సిన్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఫస్ట్ డోసు పూర్తయిన వారికి రెండో డోసు వేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ ఏ ఏంహెచ్ఓలు,  శానిటేషన్, బయోవర్సిటి అధికారులు తదితరులున్నారు.