వేసవి సెలవుల్లో స్పెషల్‌ ట్రైన్స్.. వివరాలివే

SCR canceled 6 trains as passenger traffic is low

వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌- తిరుపతి- కాకినాడ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్‌-తిరుపతి మధ్య

07433 నంబర్‌ గల రైలు మే17 న సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదేవిధంగా 07434 నంబర్‌ గల రైలు మే 19న రాత్రి 8.25 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ ట్రైన్స్ సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూర్‌, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుంటూర్‌, రేణిగుంట స్టేషన్లలో ఆగనున్నాయి.

తిరుపతి-కాకినాడ మధ్య

07435 నంబర్‌ గల రైలు మే18న సాయంత్రం 4.15 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అదేవిధంగా 07436 నంబర్‌ గల రైలు మే19న ఉదయం 7.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 6.40 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్స్ రేణిగుంట, గుడూర్‌, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడెపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. రైల్వే బుకింగ్ కేంద్రాలతో పాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.