స్పీడ్ న్యూస్ @ 10 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 10 pm* సంగారెడ్డి జిల్లా.. ఆందోల్ మండలం, అన్నసాగర్ వద్ద జరుగుచున్న ముర్షద్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.

* మహబూబాబాద్: డోర్నకల్ మండలం ముల్కలపల్లి దగ్గర ఆకేరు వాగులో ఈతకు వెళ్ళి ఇద్దరు యువకులు గల్లంతు.ఒకరి మృతదేహం లభ్యం.

* సంగారెడ్డి జిల్లా… ఒకే కాన్పు లో నలుగురు పిల్లలు. సదాశివ పేట మండలం కంబాలపల్లికి చెందిన కుమ్మరి బాల మని కి ఒకే కన్పు లో నలుగురు సంతానం. తల్లి, శిశువులు సురక్షితం.

* మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో టిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలొ పాల్గొన్న తెరాస మహిళా వార్డు కౌన్సిలర్ లు. పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు.

* సూర్యాపేట లో 93 మందికి 55 లక్షల రూపాయల విలువైన  ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి.

* హుజురాబాద్ నియోజకవర్గం.. ఇల్లందకుంట మండలం బూజునూర్ గ్రామంలో ధూమ్ ధామ్ కార్యక్రమం. పాల్గొన్న మంత్రి హరీష్ రావు, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నాయకులు పాడి కౌశిక్ రెడ్డి.

* కరీంనగర్: వీణవంక మండలం కొత్తపల్లి గ్రామస్తులతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమావేశం. పాల్గొన్న జీహెచ్ఎంసీ రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి. ఈ సందర్భంగా టిఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తామంతా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తానని గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మానం.

* అదిలాబాద్ జిల్లా..  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కు లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న.

* హైద్రాబాద్: నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్బాగ్,  నారాయణ గూడ, ఖైరతాబాద్, అఫ్జల్ గంజ్, బేగంబజార్, గోశామహల్, మంగళహాట్ లలో ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం.

* మెదక్ జిల్లా…  నర్సాపూర్ మండలంలోని పెద్ద చింత కుంట గ్రామంలో  ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ చీరలను పంపిణీ.

* జోగులాంబ గద్వాల జిల్లా.. జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కనీస మద్దతు ధరలు వాల్ పోస్టర్ ఆవిష్కరించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

* నారాయణ్ పేట్ జిల్లా… మక్తల్ మండలం సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టం…3.317  టీఎంసీ. ప్రస్తుత నీటి మట్టం..2.63 టీఎంసీ. ఇన్ ఫ్లో .. 8000 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో… 8000 క్యూసెక్కులు.

* రంగారెడ్డి జిల్లా.. షాద్ నగర్ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న పర్యాటక అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  దేవాలయ ఆవరణలో శమీ మొక్కను నాటారు.

* రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలం అవునురు గ్రామంలో జెడ్పిటిసి గుండం నరసయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్.

* యదాద్రి జిల్లా : రామన్నపేట మండలం కొమ్మాయి గూడెం, కొత్త గూడెం, శోభనాద్రి, రామన్నపేట మండల కేంద్రంలో  బతుకమ్మ చీరల పంపిణీ. 70 మంది లబ్ధిదారులకు  కళ్యాణ లక్ష్మీ- షాధిముభారక్ చెక్కులు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణ రెడ్డి.

* దుండిగల్ మున్సిపాలిటీ పరిదిలోని ఎంఎల్ఆర్ఐటి ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, కళాశాల చైర్మైన్ లక్ష్మారెడ్డి, కళాశాల ట్రెజరర్ మర్రి మనతరెడ్డి హాజరయ్యారు. కళాశాల్లోకి విద్యార్థులు సంప్రదాయ వస్ర్తలంకరణతో వేలమంది హాజరై బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆటలు, నృత్యాలు చేశారు.