స్పీడ్ న్యూస్ @ 10 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 10 pm* నల్లగొండ జిల్లా.. వేములపల్లి వద్ద బైక్ అదుపుతప్పి గొర్ల భరత్  రెడ్డి అనే యువకుడు మృతి. కొడుకు వార్తను తట్టుకోలేక  తండ్రి సిపిఎం నాయకుడు గొర్ల ఇంద్రారెడ్డి గుండెపోటుతో మృతి.

* నాగర్ కర్నూల్ జిల్లా.. అచ్చంపేటలో మార్కoడేయ దేవాలయంలో దేవినవరాత్రుల సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి,బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సతీమణీ గువ్వల అమల.

* నల్లగొండ జిల్లా.. వేములపల్లి వద్ద బైక్ అదుపుతప్పి గొర్ల భరత్  రెడ్డి అనే యువకుడు మృతి. కొడుకు వార్తను జీర్ణించు కోలేక తండ్రి సిపిఎం నాయకుడు గొర్ల ఇంద్రారెడ్డి గుండెపోటుతో మృతి.

* ఖమ్మం జిల్లా.. ఖమ్మం త్రీ టౌన్ ఏరియాలో బతుకమ్మ వేడుకలకు హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మేయర్ నీరజ , మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి పువ్వాడ.

* కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా:తిర్యాణి మండలంలోని కొత్తగూడ  (మొర్రిగూడ )గ్రామానికి చెందిన పేంద్రం శంకర్ అని వ్యక్తి ని తన చేనులో గంజాయి మొక్కలు పెంచుతున్నందుకు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన రెబ్బెన సి ఐ ఎస్ సతీశ్ కుమార్.

* జోగులాంబ గద్వాల జిల్లా.. అలంపూర్ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నాలుగో రోజు శ్రీ జోగులాంబ అమ్మవారు కూష్మాండ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

* జోగులంబ గద్వాల జిల్లా.. అలంపూర్ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా  శ్రీ జోగులంబ అమ్మవారి ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రంజన్ రతన్ కుమార్.

* మహబూబ్ నగర్ జిల్లా .. చిన్నచింతకుంట మండలం లాల్ కోట గ్రామ సమీపంలో ఓ మినీ వ్యాన్ లో 23 వేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం కేసు నమోదు చేసిన చిన్న చింతకుంట పోలీసులు.

* సూర్యాపేట జిల్లా .. సూర్యాపేట పట్టణములోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయము వద్ద సూర్యాపేట జిల్లా & పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి. పాల్గొన్న జడ్పీ ఛైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు,  మార్కెట్ చైర్మైన్ ఉప్పల లలితా ఆనంద్, మున్సిపల్ చైర్మైన్  పెరుమళ్ల అన్నపూర్ణ,ఆర్యవైశ్య మహిళ అధ్యక్షురాలు శారదా.

* గ్రీన్ఇండియా చాలెంజ్.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దసరా పండుగ సందర్భంగా ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు నినాదంతో చర్లపల్లి డివిజన్ చక్రిపురం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కలు నాటిన హైదరాబాద్ నగర మాజీ మేయర్ బోంతు రామ్మోహన్, కార్పోరేటర్ బోంతు శ్రీదేవి యాదవ్. అనంతరం ఆలయంలో దుర్గాదేవి అమ్మవారి పూజలో పాల్గోన్నారు.

* హుజురాబాద్.. జమ్మికుంట మునిస్పల్ లోని గాంధీ చౌరస్తాలో కళాకారుడు సాయి చంద్ తో  ధూమ్ ధామ్.  పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేంధర్ కోరుకంటి చందర్, మునిస్పల్  ఛైర్మన్  రాజేశ్వర్రావు, జిల్లా పరిషత్ చైర్పన్ విజయా భారీ ఎత్తున పాల్గొన్న టిఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు.

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో స్ట్రాంగ్ రూం లను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల    ప్రధాన అధికారి శశాంక గోయల్.పాల్గొన్న జిల్లా కలెక్టర్ కర్ణన్,సి పి సత్యనారాయణ,రెవెన్యూ డివిషన్ అధికారి.

* హనుమకొండ జిల్లా.. కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలోని సుమారు 60మందికిపైగా యూత్ నాయకులు తెరాసకు మద్దతు తెలుపుతూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. పాల్వంచ జగన్నాధపురం పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం. పాల్గొన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆలయ ఈవో శ్రీనివాస రావు,  జెడ్పి వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్.

* ఖమ్మం జిల్లా.. నేలకొండపల్లి  మండలం బైరవునిపల్లి లో బైక్ పై వచ్చి రేపాల సీతమ్మ అనే మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు.

* ఖమ్మం జిల్లా.. కామేపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో 5 లక్షల 90 వేల చేప పిల్లల ను సొసైటీలకు పంపిణీ చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులు , జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలా భాను.

* సూర్యాపేట జిల్లా..  జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మల గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్. నూతన చైర్మన్ గావూజీ  హనుమంతరావు బాధ్యతలు చేపట్టారు.

* కరీంనగర్ జిల్లా.. దళితులతో ఎమ్మెల్యే ఆరూరి ఆత్మీయ సమావేశం. జమ్మికుంట మండలంలోని విలా సాగర్ గ్రామంలో దళితులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్.

* కరీంనగర్ జిల్లా.. హుజూరాబాద్ నియోజకవర్గం, వీణవంక మండలం కనపర్తి గ్రామంలో  యూత్ సమావేశం నిర్వహించారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,  మరియు జడ్పిటిసి వనమాల సాధవ రెడ్డి,  గార్లతో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెళ్లు శ్రీనివాస్ యాదవ్ గారి గెలుపు కొరకు గ్రామంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్ని సామాజిక వర్గాల ప్రజలను ప్రచారంలో మమేకం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సూచించారు.

* హనుమకొండ జిల్లా.. హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ కులస్తుల సమావేశం పాల్గొన్నారు. కురుమ కులస్తులు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గేల్లు శ్రీనివాస్ యాదవ్ గారి కి పూర్తి మద్దతు ఇస్తామని కురుమ సంఘ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

* కరీంనగర్: వీణవంక మండలం ఎల్భాకలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి ఇంటింటి ప్రచారం. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరిన ఎమ్మెల్యేలు. గడపగడపకు ప్రచారానికి వెళుతుంటే ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కే అండగా ఉండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు.

* వనపర్తి జిల్లా.. వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయం 73 మంది లబ్దిదారులకు రూ.28.59 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .

* మేడ్చల్ : జీడిమెట్ల పియస్ పరిధి ఎస్.ఆర్ ఇంజినీరింగ్ వర్క్స్ లో అర్ధరాత్రి చోరీ. రాజేందర్ రెడ్డి (ఓనర్)అనే వ్యక్తికి చెందిన తొమ్మిది తులాల బంగారం చోరీ. నిన్న బంగారం తాకట్టు పెట్టడానికి కంపెనీకి తీసుకువచ్చిన యజమాని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు.

* పెద్దపల్లి జిల్లా.. పెద్దపల్లి మండలం రాఘవపూర్ స్టేజ్ వద్ద రోడ్ దాటుతుండగా టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే యువతి(18)మృతి.

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ పట్టణం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో  హుజురాబాద్ పాన్ షాప్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు  ఓటవేస్తామని మినిస్టర్ గంగుల కమలాకర్ కు వినతి పత్రం అందజేసిన  పాన్ షాప్ యజమానులు.

* నారాయణ్ పేట్ జిల్లా…మక్తల్ మండలం లింగంపల్లి గ్రామం వద్ద జిన్నింగ్ మిల్ ను ప్రారంభించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాంమోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి. పాల్గొన్న జడ్పీ చెర్ పర్సన్ వనజ, డీసీసీబీ చెర్మాన్ నిజాం పాషా.