స్పీడ్ న్యూస్ @ 10 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 10 pm* సిద్దిపేట జిల్లా.. సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ లో సీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు. వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి- ప్రణీత, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్- రాజ్ ప్రతీప, అదనపు కలెక్టర్​ ముజమ్మిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ శ్రీ ప్రపుల్ దేశాయ్.

* రంగారెడ్డిజిల్లా : మహేశ్వరం మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం మండలంలోని  పెద్దమ్మ తాండలో  20 లక్షల రూపాయలతో, నల్లచెరువు తాండలో 14లక్షల రూపాయలతో, కళ్ళం చెరువు తాండ లో10 లక్షల రూపాయలతో నిర్మించే సిసి రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆకనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 25 లక్షల రూపాయలతో, కె.బి తాండ లో 9 లక్షలు రూపాయలతో వేసే సీసీ రోడ్ల పనులకు మంత్రి సబితా రెడ్డి  శంకుస్థాపనలు చేశారు.

* నాగర్ కర్నూల్ జిల్లా.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాశిపల్లి గ్రామం కె ఎల్ ఐ కాలువలు ప్రమాదవశాత్తు పడి అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు (45) మృతి.

* నాగర్ కర్నూల్ జిల్లా.. వెల్దండ మండలం పెద్దాపురం గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి.

* జోగులాంబ గద్వాల జిల్లా.. జోగులాంబ గద్వాల జిల్లా లో ఉపాధిహామీ పథకంలో విధులపట్ల నిర్లక్ష్యం వహించిన 17 మంది టెక్నీకల్ అసిస్టెంట్ లను సస్పెండ్ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష.

* హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫెస్టివల్ మేళాను ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ, ఎగ్జిబిషన్ ఉపాధ్యక్షులు వినయ్ కుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ ప్రభాషేంకర్, జాయింట్ సెక్రటరీ జానకిరామ్, ట్రెజరర్ బి. హనుమంతరావు.

* జగిత్యాల.. కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బీజేపీ ఎంపీటీసీ  సామల లక్ష్మణ్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు 250మంది యువకులు, సూరంపేట, తిర్మలాపూర్ గ్రామాలకు చెందిన యువకులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టిఆర్ఎస్ చేరారు.

* అదిలాబాద్ జిల్లా… జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ లో ఉద్యోగాల ఆద్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు. సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

* రంగారెడ్డి జిల్లా.. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీలో నెక్నపూర్ కి చెందిన సుమారు 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో  టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

* రంగారెడ్డి జిల్లా: మాహేశ్వరం మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు (SHG) గ్రూప్స్ మహిళలకు చెక్కులు, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ  చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి.

* రంగారెడ్డి జిల్లా.. మొయినాబాద్ మండల అజీజ్ నగర్ గ్రామ సమీపంలోని విద్యాజ్యోతి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు. ముఖ్యఅతిథిగా అలేరు ఎమ్యెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు.

* నిర్మల్ జిల్లా.. కేంద్రం లోని బంగల్ పేట్ వద్ద కోటి రూపాయలతో మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పాల్గొన్న  జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి.

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారం.

* మంచిర్యాల జిల్లా.. తాల్లగురిజాల పీఎస్ పరిధిలోని ఓ మహిళలను బలాత్కారం చేసిన నేరంలో దుగ్నేపెళ్లి కి చెందిన చల్లూరి ధనుంజయ్ అనే వ్యక్తికి 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 13000 లు జరిమానా విధించిన ఆదిలాబాద్ జిల్లా మహిళ కోర్టు.

* కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: తిర్యాణి మండలంలోని పంగిడి మధర పరిధిలోని మర్కగూడా పంచాయతీ వాండిగుడ గ్రామానికి చెందిన పర్చాకే బల్హర్షా అనే  వ్యక్తి.. తన వ్యవసాయ చేనులో గంజాయి మొక్కలు పెంచుతున్నందుకు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రెబ్బెన సిఐ ఎస్ సతీశ్ కుమార్.