స్పీడ్ న్యూస్ @ 10 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 10 pm* హైదరాబాద్.. ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధి చిలుకనగర్ లో డీసీపీ రక్షిత మూర్తి ఆధ్వర్యంలో పలు విభాగాలకు చెందిన 200 మంది పోలీసులతో నిర్భంధ తనిఖీలు. సరైన పత్రాలు లేని 32 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో, ఒక కారు స్వాధీనం.

* అదిలాబాద్ జిల్లా.. అదిలాబాద్ ముఖద్వారమైన మావల్ల బైపాస్ వద్ద వెల్కమ్ బోర్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టం లు ప్రారంభించిన ఎమ్మెల్యే జోగు రామన్న. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అడిషనల్ కలెక్టర్ నటరాజ్, మునిసిపల్ కౌన్సిలర్లు.

* ఢిల్లీ.. తెలంగాణ భవన్ లో కన్నుల పండుగగా బతుకమ్మ వేడుకలు. తెలంగాణ భవన్ సిబ్బంది, తెలుగు మహిళల ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ సంబురాలు. వేడుకలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం సాహ్ని, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.

* హైదరాబాద్.. జిఎచెంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో  పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్.

* మహబూబ్ నగర్ జిల్లా… అడ్డాకుల మండలం పెద్ద మునగల్ చెడ్ గ్రామంలో అడ్డాకుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్దిదారులకు గాను 33,03,828/-రూపాయల కల్యాణ లక్ష్మీ/ షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణమ్మ, ఎంపి రాములు.

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారం. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

* యాదాద్రి భువనగిరి జిల్లా : ఆలేరు పట్టణ కేంద్రం లో ఒక కోటి ఇరవై లక్షలతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మున్సిపల్ చేర్మెన్ వస్పరి శంకరయ్య.

* నిర్మల్ జిల్లా.. లక్ష్మణచాంద మండలం వడ్యాల గ్రామం నందు 16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవణానికి శంఖుస్థాపన చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

* హైదరాబాద్.. అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో బతుకమ్మ పండగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఉద్యోగినులు ఆడిపాడారు. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించిన ఉద్యోగులు నవరాత్రి  పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు.  పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

* సిద్దిపేట జిల్లా.. దుబ్బాక మండలం హబ్సీపూర్ దగ్గర ఏడుగురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. కర్ణాటక, తమిళనాడు కు చెందిన నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు టీంగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

– కామారెడ్డి, రామాయంపేట, సిద్దిపేట, జనగాం, బాన్సువాడ లో ఇటీవల దొంగతనాలు చెసినట్టుగా ఏసిపి దేవారెడ్డి వెల్లడి.

* హైదరాబాద్.. మాదాపూర్ హెచ్ఐసిసి లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ,వి హబ్ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి అవార్డ్స్2021 కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, హెల్త్ కమిషనర్ వాకాటి కరుణ, సీఎంఓ సెక్రటరీ స్మిత సభర్వాల్, TCEI ప్రెసిడెంట్ రాఖీ కంకరియా, వి హబ్ సిఇఓ దీప్తి రావుల.

* షాద్ నగర్ మునిసిపల్ కమిషనర్ లావణ్య సస్పెన్షన్. నిన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఇద్దరు కూలీలు మృతి. పనులలో నిర్లక్ష్యం వహించినందుకు కమిషనర్ లావణ్య ను సస్పెండ్ చేసిన సిడియంఏ కమిషనర్- డైరెక్టర్ సత్యనారాయణ.

* నాగర్ కర్నూల్ జిల్లా.. జిల్లాకేంద్రంలోని సంతబజార్ లో శ్రీ తుల్జా భవాని యువక బృందం ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

* జయశంకర్ భూపాలపల్లి జిల్లా.. మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి అటవీ ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు.

* హనుమకొండ : కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలోని బిజెపి పార్టీకి చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు.

* హనుమకొండ.. సీపీఐ దివంగత నేత భగవాన్ దాస్ 18 వ వర్థంతి సందర్బంగా హనుమకొండలోని ఆయన విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.

* సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ లో భారీ చోరీ. మార్వాడీ గల్లీ కాలనీ లో  తాళం వేసి ఉన్న  మార్వాడీ నందు సేట్ ఇంట్లో చోరీ. 10 కిలో ల వెండి, 60 తులాల బంగారం, నాల్గు లక్షల యాభై వేలు నగదు అపహరణ.. కేసు నమోదు.

* మెదక్ జిల్లా.. చేగుంట మండలం పులిమామిడి శివారులో రోడ్డు ప్రమాదం. చెట్టుకు బైక్ ఢీకొని బోనాల గ్రామానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి మృతి.

* నల్గొండ జిల్లా..కట్టంగూర్ లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వ్యవసాయ పరికరాల  ప్రారంభోత్సవం చేసి, అనంతరం  కొరమండల్ వారి గో శక్తి ప్లస్ ఉత్పత్తులను ఆవిష్కరించిన  మంత్రి జగదీష్ రెడ్డి.. పాల్గొన్న ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే నంద్యాల దయాకర్ రెడ్డి.

* కరీంనగర్ జిల్లా.. టీఆర్ఎస్ సోషల్ మీడియా వర్కర్ నాంపల్లి జగపతిపై నిన్న జరిగిన దాడి బాధితుడిని బోర్ణపల్లిలో పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి, సోషల్ మీడియా నాయకులు.

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్  పట్టణం  ఇప్పల నర్సింగపూర్  8,9,11 వార్డులో ఉప ఎన్నికల్లో  భాగంగా ఎన్నికల ప్రచారం  నిర్వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ   అబ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. పాల్గొన్న మినిస్టర్ గంగుల  కమలాకర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి.

* సూర్యాపేట జిల్లా.. నేరేడుచర్ల శివాలయం పక్కన నివసిస్తున్న  ఐస్ మిల్, మొర్తాల నాగిరెడ్డి.. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య.

* మహబూబ్ నగర్ జిల్లా.. అడ్డాకుల మండలం పెద్ద మునుగల్ చేడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభం,33/11 కేవి సబ్ స్టేషన్, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎం ఎల్ ఏ ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎంపి  పి.రాములు.

* సూర్యాపేట జిల్లా.. చింతలపాలెం మండలం రెబల్లే గ్రామానికి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.