స్పీడ్ న్యూస్ @ 10 pm

* సంగారెడ్డి జిల్లా…. బతుకమ్మ సంబరాల్లో అపశృతి. పట్టణ కేంద్రంలో మహబూబ్ సాగర్ చెరువు కట్ట బతుకమ్మ ను వేస్తుండగా మహిళా కాలుజారి చెరువులో పడి పోయిన మహిళ. బోట్ సాయంతో వెలికితీత. స్పృహ కోల్పోయిన మహిళను ఆస్పత్రికి తరలించారు.

* మహబూబ్ నగర్ జిల్లా.. మహబూబ్ నగర్ పట్టణములోని  ట్యాంక్ బండ్ పై వైభవోపేతంగా సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలు. అలరించిన లేజర్ షో. రేణుక ఎల్లమ్మ దేవాలయం నుంచి బతుకమ్మలు, కళాజాత ర్యాలీ. శాస్త్రోక్తంగా బతుకమ్మ నిమజ్జనం.

* సిద్ధిపేట జిల్లా.. సిద్ధిపేటలో ప్రత్యేక ఆకర్షణగా..సుడా హరిత పార్కు.  సిద్దిపేట ఎల్లమ్మ గుడి సమీపం లో నూతనంగా నిర్మించిన హరిత పార్క్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.

* హైదరాబాద్… ప్రగతి భవన్ లో బుధవారం జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారి సతీమణి శోభమ్మ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ  మరియు కుటుంబ సభ్యులు.

* జగిత్యాల.. కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన దుబ్బాక సాయిలు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో పెంచుతున్న నిషేధిత గంజాయి మొక్కలను స్వాధీనం. గంజాయి మొక్కలను తహశీల్దార్ ఎదుట పంచనామ నిర్వహించి  నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.

* ఆదిలాబాద్ జిల్లా.. ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామ శివారులోని ఓ పొలంలో 300 గంజాయి మొక్కలను తొలగించి కాల్చి దహనం చేసిన పోలీసులు. ఒకరిపై కేసు నమోదు.

* మహబూబ్ నగర్ జిల్లా.. మూసాపేట మండల కేంద్రంలో  మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 21 మంది లబ్దిదారులకు గాను 21,02,436/-రూపాయల కల్యాణ లక్ష్మీ- షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

* గజ్వేల్.. నియోజకవర్గ పరిధిలో దేవి శరన్నవరాత్రి (దసరా)ఉత్సవాల సందర్భంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

* ఆదిలాబాద్ జిల్లా.. ఉట్నూర్ మండలం నిలాగోంది గ్రామంలో ఐటిడిఎ ఆద్వర్యంలో గర్భిణీ స్త్రీల కోసం ఇప్ప పువ్వు లడ్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. పాల్గొన్న రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి భవేష్ మిశ్రా.

* సిద్ధిపేట జిల్లా.. ఇంటర్ మీడియట్ పరీక్షల స్పాట్ వ్యాల్యూయేషన్ కేంద్రాన్ని సిద్ధిపేట లో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇంటర్ ఇంటర్ మీడియట్ కాంట్రాక్టు లెక్చరర్ల JAC ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం.

* నిర్మల్ జిల్లా.. మామడ మండలం కిషన్ రావుపేట గ్రామ పంచాయతీ పరిది లోని చెరువు ముందు తండాలో కుటుంబ కలహాలతో కొడుకు తోసివేయడంతో కింద పడి తల్లి అంజిబాయి (58) అక్కడికక్కడే మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* హైదరాబాద్.. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌లోని సీఏఆర్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో బుధవారం ఆయుధ పూజ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో  సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., పాల్గొని ఆయుధాల‌కు పూజ‌లు చేశారు.

* కరీంనగర్: వీణవంక మండలం మల్లన్నపల్లి, రెడ్డిపల్లిలో కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరిక.  ఉపఎన్నికల్లో భాగంగా బీజేపీ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి విషయంపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.

* జోగులాంబ గద్వాల జిల్లా.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రెండవ వార్డు లో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్.

* రంగారెడ్డి జిల్లా..  హిమాయత్ సాగర్ లో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. మంటలను అదుపు చేసుకున్న రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బంది. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి.

* రంగారెడ్డి జిల్లా.. ఇబ్రహీంపట్నంకు చెందిన వరికుప్పల అనురాధ సంవత్సరం కూతురుకు గుండె చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లక్ష్య యాబైవేల రూపాయల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపిపి కృపేష్.

* నాగర్ కర్నూల్ జిల్లా.. తిమ్మాజీపేట మండలం నేరెళ్లపల్లి గ్రామంలోని నడుపులమ్మ చెరువులో ప్రభుత్వం ఇచ్చే ఉచిత చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ శ్రేణులు  మత్స్యకారులు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ములకలపల్లి ములకలపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. జూనియర్ అసిస్టెంట్ రవీందర్ ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. కుల ధ్రువీకరణ పత్రాలు కొరకు 28,000 లంచం అడిగిన జూనియర్ అసిస్టెంట్ రవీందర్. ఏసీబీని ఆశ్రయించిన పోగళ్ల పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలం నర్సాపురం గ్రామంలో  దారుణం. 9 ఏళ్ల బాలిక పై  మాదిబోయిన సత్యనారాయణ(55) అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణ .  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తే దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత. టిటిడి కళ్యాణ మండపం సమీపంలో మూడు  అంతస్తుల భవనం కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. కొత్తగూడెం డిఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు.

* మంచిర్యాల జిల్లా.. రొటిగుడా గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన పశువుల యజమానులకు చెక్కల పంపిణీ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్.

https://www.youtube.com/watch?v=xRWRjMvN2T4

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం బేతిగల్ గ్రామ ఉప సర్పంచ్ చొప్పరి తిరుపతి ఆధ్వర్యంలో 30 మంది యువకులు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నేడు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

– నూతనంగా పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించడం జరిగింది.

* హనుమకొండ జిల్లా.. హనుమకొండ లోని  వరంగల్ 1 డిపో భవనంపై అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మహిళా మృతి.

* జగిత్యాల.. కోరుట్ల పట్టణంలోని టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో 100 మంది లబ్ధిదారులకు 1 కోటి 11 వేల 600 రూపాయల కళ్యాణలక్ష్మి,షా దీ ముబారక్ చెక్కులు.. 25 మంది లబ్ధిదారులకు  10 లక్షల 52 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.