స్పీడ్ న్యూస్ @ 10 pm

* నాగర్ కర్నూల్ జిల్లా.. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామ సమీపంలోని ఆటవి ప్రాంతంలో గొర్రెల కాపరి పుల్లయ్యపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు. అచ్చంపేట హాస్పత్రికి తరలింపు.

* జనగామ జిల్లా: జనగామ జిల్లా కేంద్రం లోని గణేష్ స్ట్రీట్ కు చెందిన మల్లేష్ (60) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని ఆత్మాహత్య.

* గ్రీన్ ఇండియా చాలెంజ్.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమంలో బాగంగా  మచ్చ  బొల్లారం   (సికింద్రాబాదు) లోని   సాయిబాబ దేవాలయం లో జమ్మిచెట్టు నాటిన  తెలంగాణ  విధ్యుత్తు నియంత్రణ మండలి (ERC chairmen) చైర్మన్ అధ్యక్షులు తన్నీర్ శ్రీరంగారావు ,తెలంగాణ స్టేట్ పుడ్ కమీషన్ మెంబర్ కొంతం గోవర్ధన్ రెడ్డి , తెలంగాణ  పంచాయితి మెంబర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి,  బిసి కమీషన్ మెంబర్ ఉపేందర్, టిఆర్ యస్ సిటీ మాజీ కార్యదర్శి, అడ్వకేట్ ఆలుగడ్డ అనిల్ కుమార్ , జాగృతి లీగల్ సెల్  స్టేట్  అధ్యక్షులు తిరుపతి వర్మ , అడ్వకేటు ఇంద్రసేనారెడ్డి , హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్  లాలారాము.

* కరీంనగర్ జిల్లా.. దళితులతో ఎమ్మెల్యే అరూరి ఆత్మీయ సమావేశం.. జమ్మికుంట మండలంలోని నగురం,నాగారం గ్రామంలో దళితులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్.

* హుజురాబాద్: జమ్మికుంట లోని  పిట్టల వాడలో చాంద్ బ్యాండ్ పోప్రెటర్ ఇబ్రహీం అనే వ్యక్తి బ్రెయిన్ స్టోక్ తో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు.

* కరీంనగర్ జిల్లా.. వీణవంకకు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న  ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, టిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి వాహనాలను హుజురాబాద్ పట్టణం జమ్మికుంట రోడ్డులో నిలిపివేసి తనిఖీ చేసిన పోలీసు అధికారులు.

* జనగామ జిల్లా: జనగామ మండలం చౌడారం గ్రామం లోని హనుమాన్ దేవాలయ వ్యవసాయ భూమి లో పూర్తిగా కుల్లిపోయి అస్తిపంజరంగా మారిన స్థితి లో గుర్తు తెలియని శవం లభ్యం, సంఘటనా స్థాలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన జనగామ పోలీసులు.

* కరీంనగర్: వీణవంక మండలం  కొండపాకలో హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారం, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎంపీపీ రేణుకాతిరుపతి రెడ్డి, జెడ్పీటీసీ వనమాల సాధవరెడ్డి.

* హనుమకొండ : కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామంలో గౌడ కులస్తులతో సమావేశం నిర్వహించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.ఈ సందర్భంగా గౌడ కులస్థులంతా తెరాసాకే తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కృషిచేస్తామన్నారు.

* ఖమ్మం జిల్లా .. వైరా బిసి కాలనీలో   పేకాట స్థావరంపై  టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు. 12  మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు. 6  బైకులు,  6  సెల్ఫోన్లు, 12 వేల రూపాయల నగదు స్వాధీనం.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..  పాల్వంచ శ్రీనివాస కాలనీ ముర్రేడు వాగులో గుర్తుతెలియని మృతదేహం(పురుషుడు) లభ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* భద్రాధ్రికొత్తగూడెం జిల్లా.. వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్, స్థానికులు. ఇల్లందు పట్టణం 14నెం. బస్తిలో ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్ లో పడిన మహిళ.  మహిళ కేకలు విని సెప్టిక్ ట్యాంక్ లో నుంచి వృద్ధురాలిని స్థానికుల సహాయంతో వెలికితీసిన కానిస్టేబుల్. ఇల్లందు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న హరి.

* ఆదిలాబాద్ జిల్లా.. ఉట్నూర్ మండల కేంద్రంలోని తుకారాం మహరాజ్ నివాసంలో పండరీపూర్ యాత్రికుల సన్నాహాక సమావేశంలో  పాల్గొన్న జడ్పి చైర్మెన్ రాథోడ్ జనార్థన్.

* కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.. కాగజ్ నగర్ హైదరాబాద్  కు చెందిన కృష్ణ ప్రసాద్  జ్ఞాపకార్థం తన కూతురు బి అనూష  50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి, ఎమ్మెల్యే సోదరుడు జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరు కృష్ణ రావు కు అందజేశారు.

* గ్రీన్ ఇండియా చాలెంజ్.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఊరు ఊరు కో జమ్మిచెట్టు గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమంలో బాగంగా  వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయం వద్ద జమ్మిచెట్టు నాటిన గ్రామ సర్పంచ్ ,వార్డు సభ్యులు.

* హుజురాబాద్: మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 100 మంది ఎలక్ట్రిషన్, ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు.. పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు.

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామంలో  మైనారిటీ ల సమావేశం. హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే , జమ్మికుంట మండలం ఇన్ ఛార్జ్ ఆరూరి రమేష్.

* మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఈవీఎంలను భద్రపరిచే భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ,కలెక్టర్ కె శశాంక.

* నాగర్ కర్నూల్ జిల్లా..  తిమ్మాజిపేటలో ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సొంత నిధులతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల  భవన నిర్మాణం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు మర్రి జమున, జక్క రఘునందన్ రెడ్డి.

* రంగారెడ్డి జిల్లా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కురుమ సంఘం ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం. హాజరైన MLC ఎగ్గే మల్లేష్, ఆంద్రప్రదేశ్ ఎంపీ మాదవ్ కురుమ సంఘం సభ్యులు క్యామ శంఖర్, రమేష్ మల్లేష్ తదితరులు.

* కరీంనగర్: వీణవంక మండలం గంగారంలో హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం. పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి.