స్పీడ్ న్యూస్ @ 10 pm

* నిర్మల్ జిల్లా : బాసర రైల్వేస్టేషన్ లో హైదరాబాద్ నుండి నాందేడ్ వెళ్లే దేవగిరి రైలు కింద ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఆదిత్య(13) మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

* హైదరాబాద్.. అనుమతి లేకుండా అడ్వర్టైజ్ బోర్డు లను హోటల్ పైన పెట్టినందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆల్ఫా హోటల్ కు 75 వేల రూపాయల జరిమాన విధించిన జిహెచ్ యంసి ఈవిడియం.

* మహబూబ్ నగర్ జిల్లా.. చిన్నచింత కుంట మండలం పర్దిపూర్ గ్రామంలో  పర్దిపూర్ లిఫ్ట్ కొరకు అధికారులతో  సమీక్షించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

* మంచిర్యాల జిల్లా : లక్షెట్టిపెట నుండి మహారాష్ట్రకు ఎలాంటి బిల్లులు అనుమతులు లేకుండా 20 లక్షల విలువ గల ఇనుము, రాగి తుక్కు తరలిస్తున్న రెండు లారీలను పట్టుకుని నలుగురి పై కేసు నమోదు చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.

* జగిత్యాల.. వెల్గటూర్ మండలం రాజారాంపల్లె వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డ దోపిడీ దొంగల ముఠా. నలుగురు నిందితులు అరెస్టు. నిందితుల వద్ద నుండి 3,52000 వేల రూపాయల విలువ గల బోర్ వెల్ పైపులు,ఒక కారు ,4 సెల్ ఫోన్స్ స్వాధీనం.

* కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.. కాగజ్ నగర్ పట్టణంలోని హై స్కూల్ పాఠశాల సమీపంలో  బొలెరో వాహనంలో తరలిస్తున్న 25 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి మద్దతుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటింటి ప్రచారం.

* హనుమకొండ : కమలాపూర్ మండలంలోని మండల స్థాయి దళిత యువత సమ్మేళన సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ యే బాల్క సుమన్.

* హనుమకొండ : తన పుట్టినరోజు సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కమలాపూర్ లో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్.

* హనుమకొండ : కమలాపూర్ మండలం లక్ష్మీపురం, గూడూరు గ్రామాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు  కార్యకర్తలు ఆపార్టీకి రాజీనామా చేసి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. పాల్గొన్న రైతు విమోచన చైర్మన్ నాగుర్ల  వెంకటేశ్వర్లు.

* హుజురాబాద్: హుజురాబాద్ మండలం రాజా పల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్, టీఆరెస్ నాయకులు పెద్ది రెడ్డి.

* హన్మకొండ జిల్లా.. ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట వద్ద సీఎం కెసిఆర్ సభ కోసం స్థలాన్ని పరిశీలించిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.

* హుజురాబాద్: జమ్మికుంట మున్సిపల్ లిమిట్స్ లోని ఆరో వార్డు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కాటన్ మిల్లులో పనిచేసే మహిళా కూలీలతో  ముచ్చటించిన మంత్రి కొప్పుల.. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కాటన్ మిల్లులో పనిచేసే మహిళా కూలీలు.

* కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట మండలంలోని సైదాబాద్, కోరేపల్లి గ్రామంలో దళితులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్.

* మహబూబ్నగర్ జిల్లా..  చిన్న చింతకుంట మండలం లోని తాసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు.. ఎస్సీ కార్పొరేషన్ లోన్ల చెక్కులను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.