స్పీడ్ న్యూస్ @ 10 pm

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం ఘన్ముకల గ్రామ మాజీ సర్పంచి రాజయ్య & గౌడ సంఘం అధ్యక్షులు విరేశం ఆధ్వర్యంలో 30 గౌడ కుటుంబాలు బిజెపి పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వివేకానంద.

* పెద్దపల్లి జిల్లా.. పెద్దపల్లి పట్టణంలోని బండారి కుంట కెనాల్ పరిసరాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా  గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరార్, ఒకరిని విచారించగా అతని వద్దనుండి అరకిలో గంజాయి స్వాధీనం చేసుకున్నా పెద్దపల్లి పోలీసులు.

* కరీంనగర్: వీణవంక మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

* ఖమ్మం జిల్లా..  కొణిజర్ల సమీపంలో ద్విచక్ర వాహనం ను ఢీ కొట్టిన లారీ.  వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చింటూ అనే యువకుడు మృతి.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ఇల్లందు మండలం కొమరారం లో న్యాయ సేవ సదస్సు .. పాల్గొన్న అదనపు న్యాయమూర్తి ముఖేష్.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా .. ఇల్లందు ఆల్మైటీ ఫంక్షన్ హాల్ లో ఇల్లందు మండల టిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్.

* హుజురాబాద్: జమ్మికుంట మున్సిపల్ లిమిట్స్ లోని కొత్త పల్లి చౌరస్తాలోని 4,5,17,18,19,20  వార్డులలోని ప్రజలతో  పబ్లిక్ మీటింగ్ . పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.

* నిర్మల్ జిల్లా కేంద్రం లోని ధ్యాగవాడ వీధిలో పల్సర్ బైక్ వచ్చి సుశీల అనే వివాహిత మెడలో నుంచి రెండు తులాల బంగారం గొలుసు లాక్కెళ్లిన గుర్తు తెలియని దొంగలు.

* హనుమకొండ : కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ సమక్షంలో తెరాస లో చేరిన బిజెపి కార్యకర్తలు.

* ప్లినరీ ముఖ ద్వారం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాను ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యేలు మాధవరం, మాగంటి గోపినాద్, అరికపూడి గాంధీ.

* మంచిర్యాల జిల్లా.. బెల్లంపల్లి లో దివంగత మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి.

* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన భవేష్ మిశ్రా.

* హనుమకొండ: ఐనవోలు మండలం ఒంటిమామిడిపెల్లి లో ప్రమాదవశాత్తు  ట్రాక్టర్ డబ్బా మీద పడి గుటుకుల కుమారస్వామి(48) అనే వ్యక్తి మృతి.

* రంగారెడ్డి జిల్లా.. షాబాద్ పాహిల్వాన్ షా చెరువు, చెందన్ వెళ్లి పెద్ద చెరువుల్లో 7 లక్షల 20 వేల చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. పాల్గొన్న జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.

* జగిత్యాల .. గంజాయి గుట్టు రట్టు  చేసిన జగిత్యాల పోలీసులు. అసిఫాబాద్ లో సాగు…జగిత్యాలకు రవాణా. గంజాయి సేవించే స్థితి నుంచి రవాణా స్థాయికి చేరుకున్న ఇద్దరు యువకులు.. సాగు చేస్తున్న వ్యక్తి తో పాటు రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్. నిందితుల వద్ద నుండి గంజాయి మొక్కలతో సహా మూడు బైకుల స్వాధీనం.

* రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని, బద్ది పోచమ్మ తల్లి ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్ మాధవి.  దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించిన ఆలయ అధికారులు.

* హనుమకొండ : కమలాపూర్ మండల కేంద్రంలో గౌడ కులస్తులు ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే బాల్క సుమన్.. తెరాస లో భారీగా చేరిన గౌడ కులస్తులు .. గులాబీ కండువా కప్పి ఆహ్వానించినా విప్ బాల్క సుమన్.

* ఖమ్మం జిల్లా.. కొణిజర్ల మండల  పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుళ్ళు  హోంగార్డు విధుల పట్ల అలసత్వం వహించి మద్యం సేవించడంతో మెమో జారీచేసిన సీపీ వారియర్. నలుగురు కానిస్టేబుల్స్,  హోం గార్డును ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేసిన సీపీ వారియర్.

* ఆదిలాబాద్ జిల్లా.. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో ఆదివాసీ ముద్దు బిడ్డ కొమురం భీమ్ వర్ధంతి సందర్బంగా విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న. పాల్గొన్న రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, తెరాస నాయకులు.

* మహబూబ్ నగర్ జిల్లా.. ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని భుత్పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మున్సిపల్ ఛైర్మన్ సత్తూర్ బస్వరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో  కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా భారీగా తరలించాలని కార్యకర్తలకు దిశగా, నిర్ధేశం చేశారు.

* మంచిర్యాల: దండేపల్లి మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా మెగా ఆరోగ్య శిభిరం. పాల్గొన్న రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసిపి అఖిల్ మహాజన్.

* నిర్మల్.. వచ్చే నెల 15 తేదీన వరంగల్ లో జరిగే తెరాసా ద్విదశాబ్ది విజయ గర్జన సభ సన్నాహక సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్.

* రంగారెడ్డి జిల్లా.. కడ్తాల్ మండలం మైసిగండి దగ్గర శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై బి.వి.ఆర్ ఇన్ఫ్రా  ఎస్వి గోల్డెన్ సిటీ 5వ నూతన వెంచర్ ను ప్రారంభించిన ప్రొప్రైటర్ వెంకటేష్.