స్పీడ్ న్యూస్ @ 10 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 10 pm* హైదరాబాద్.. జీహెచ్ఎంసీ ప‌రిధిలో  మురుగు నీటి వ్యవస్థ ని మరింత మెరుగు పరిచడంతో పాటు మంచి నీటి నిర్వాహణ కోసం ఒకేరోజు రూ.5వేల కోట్లు మంజూరు చేస్తూ జీవో లు జారీ చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.

* ముగ్గురు పోలీస్ కుటుంబాలకు చెక్కులు అందజేసిన సైబరాబాద్ సీపీ

హైదరాబాద్.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తూ.. రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు పోలీస్ కుటుంబాలకు సైబరాబాద్ సీపీ ఆఫీసులో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర చేతులమీదుగా చెక్కులు అందజేశారు. విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ తులసీరాం  కుటుంబానికి రూ. 5 లక్షలను, షాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రీశైలం కుటుంబానికి రూ. 13 లక్షలను,  అనారోగ్యంతో మరిణించిన అర్మేడ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం‌ఏ సయీద్ కుటుంబానికి రూ రూ. 3,93,991 చెక్కులను సీపీ అందజేశారు.

* హైదరాబాద్.. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తూర్పు మండలం డిసిపి రమేష్ ఆధ్వర్యంలో  కమల్ నగర్,  మూసి పరీవాహక ప్రాంతాలలో పోలీసులు కార్డన్ సెర్చ్. అనుమానాస్పదంగా ఐదుగురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నెంబర్ ప్లెట్లు సక్రమంగా లేని23 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

* సంగారెడ్డి జిల్లా..  పుల్కాల్ మండలం సింగూర్ ప్రాజెక్టు పెరిగిన వరద నీరు 6,9,11 మూడు గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని వధూళుతున్న అధికారులు.  ఇన్ ప్లో 24114 క్యూసెక్కులు. ఔట్ ప్లో 34673 క్యూసెక్కులు.

* మంచిర్యాల జిల్లా..  బెల్లంపల్లి  రడగంబాలబస్తికి చెందిన పసునూరి స్వప్న (41)అనే వివాహిత పోచమ్మ చెరువులో దూకి ఆత్మహత్య.

* కరీంనగర్ జిల్లా.. తిమ్మాపూర్ మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులను నియమించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.

* 20,311.08 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తొలగింపు

హైదరాబాద్ :  గణేష్ నిమజ్జనం జరిగిన చెరువులు, ప్రత్యేక  కోలనులలో వేసిన గణేష్ ప్రతిమలను తొలగించే  చర్యలు జిహెచ్ఎంసి ఇంకను కొనసాగిస్తున్నది.  నేటి వరకు 20,311.08 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు.

* పోలీసులకు చిక్కిన గంజాయి ముఠా

ఖమ్మం జిల్లా.. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట వద్ద పోలీసులకు చిక్కిన గంజాయి ముఠా. రవాణా చేస్తున్న ముగ్గురు గంజాయి ముఠా లో ఒకరు ఖమ్మం జిఆర్పీ కానిస్టేబుల్ రామకృష్ణ. రైలు ద్వారా వస్తున్న గంజాయిని ఖమ్మం రైల్వే స్టేషన్లో తీస్కుని పంపిణీ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సిఐ సత్యనారాయణ రెడ్డి.

* మంచిర్యాల జిల్లా.. చెన్నూర్ పట్టణంలోని జెండా వాడకు చెందిన కమ్ముల రాజేష్ 35 ఆర్థిక ఇబ్బందుల తో పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య.