స్పీడ్ న్యూస్ @ 2 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 2 pm* మహబూబ్ నగర్ జిల్లా.. జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం వల్లబురావు పల్లి గ్రామానికి చెందిన ఎద్దుల ఆంజనేయులు (23) వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య.

* హనుమకొండ : కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, యువకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్.

* సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో  జనరల్ మేనేజర్ తో సమావేశమైన తెలంగాణ, (బీదర్, రాయచూరు, గుల్బర్గా) కర్ణాటక, బీడ్ మహారాష్ట్ర  ఎంపీలు.

  1. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, 2. ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3. అసదుద్దీన్, 4. ఆర్వంద్, 5. కవిత, 6. రంజిత్, 7. అచంపేట్ రాములు, 8. నామ నాగేశ్వర్ రావు, 9. బడుగు లింగయ్య, 10. BB. పాటిల్, 11. ప్రభాకర్ రెడ్డి, 13. రాజా అమ్రేశ్వర్ నాయక్(రాయచూరు), 14. Dr. ఉమేష్ జాదవ్.

* కరీంనగర్.. ఆకస్మిక తనిఖీల్లో 10.40 లక్షల రూపాయల స్వాధీనం.  హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంగళవారం నాడు టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, జమ్మికుంట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు సందర్భంగా 10.40 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* కరీంనగర్ జిల్లా .. హుజూరాబాద్ లో మంత్రి గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు దగ్గర ఉండి తన వాహన  తనిఖీలకు సహకరించిన మంత్రి గంగుల.

* కరీంనగర్ జిల్లా.. తిమ్మాపూర్ మండలంలోని మహాత్మ నగర్ గ్రామంలో లారీ-బైక్ ఢీ. ఒకరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

* నిజామాబాద్ : మక్లూర్ మండలం ముల్లంగిలో గుర్తుతెలియని వివాహిత శవం లభ్యం. హత్యచారం చేసి కాల్చి చంపారని స్థానికుల అనుమానం. విచారిస్తున్న పొలీసులు.

* కరీంనగర్ జిల్లా..  హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి 70 మంది యువకులు బిజెపి పార్టీకి రాజీనామా చేసి నేడు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు.

* చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని పలు రైల్వే సమస్యలపై ఈ రోజు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్య తో సమావేశం అయిన ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి.

* హుజురాబాద్ నియోజకవర్గం.. ఇల్లందకుంట మండలం బూజునూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సూడా చైర్మన్ జీవి రామకృష్ణారావు. పాల్గొన్న ఇల్లందకుంట జడ్పిటిసి పావనివెంకటేష్, వేలేరు జడ్పిటిసి చాడ సరిత.

* నాగర్ కర్నూల్ జిల్లా.. అచ్చంపేట పాతబజారులో దసరా పండగ సందర్భంగా పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ తులసీ రాం,ఆర్డీఓ పాండు, కౌన్సిలర్లు.

* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు‘ లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై.. కాలనీ వాసులతో కలిసి జమ్మి చెట్టును నాటారు.

* వికారాబాద్ జిల్లా: కోటపల్లి మండల కేంద్రం సమీపంలో గుర్తుతెలియని మహిళ(35) అనుమానాస్పద స్థితిలో మృతి. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

* నారాయణ్ పేట్ జిల్లా… మక్తల్ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ ఇన్ ఫుట్ డీలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి. పాల్గొన్న జడ్పీ చెర్ పర్సన్ వనజ, ఆడిషనల్ కలెక్టర్ చంద్ర రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్,  ఎంపీపీ వనజ.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. భద్రాచలం రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో రేపటి నుండి ఈనెల 15వ తేదీ వరకు జరగనున్న సంక్షేప రామాయణ హోమం.