స్పీడ్ న్యూస్ @ 2 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 2 pm* సూర్యాపేట జిల్లా..  నేరేడుచర్ల మండల కేంద్రంలో సూర్యాపేట కు చెందిన  వ్యక్తి  వద్దనుండి 13కేజీల గంజాయి పట్టివేత. వ్యక్తిని అదుపులో  తీసుకోని విచారిస్తున్న పోలీసులు.

* హైదరాబాద్.. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చిలుకానగర్ డివిజన్ సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్.

* వనపర్తి జిల్లా..  వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో 247 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 87 మంది లబ్దిదారులకు రూ.31.36 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసి వారితో కలిసి  భోజనం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

* నిర్మల్ జిల్లా.. జిల్లా కేంద్రంలో ని దేవర కోట వేంకటేశ్వర స్వామి ఆలయంలో జమ్మి చెట్టు నాటిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

* హనుమకొండ జిల్లా… కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన యువత పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి.

* మంచిర్యాల జిల్లా.. కోటపల్లి మండలం కొల్లూరు ఇసుక క్వారీ నుంచి అదనపు లోడుతో వెళుతున్న నాలుగు ఇసుక లారీలను పట్టు కొని కేసు నమోదు చేసినతహసీల్దార్ గోవింద్.

* హైదరాబాద్.. అమీర్పేట్ డివిజన్ లో 50 పడకలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ వాణిదేవి, హైద్రాబాద్ కలెక్టర్ శర్మన్, డిఎమ్ఈ రమేష్ రెడ్డి, టిఎస్ఎమ్ఐడిసి ఎండి  చంద్ర శేఖర్ రెడ్డి.

* వికారాబాద్.. బతుకమ్మ సంబురాలు మరియు వెంకటేశ్వర స్వామి ఊరేగింపు లో కోలాటం, జడ కోలాటం, భజనలో పాల్గొని స్వయంగా ఆడిపాడిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.

* రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు సందర్భంగా  8 వ మహాగౌరి  అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అర్చకులు.

* నల్గొండ జిల్లా.. దేవరకొండ 4 వా వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్.

* నిర్మల్ జిల్లా : బాసర శ్రీజ్ఞాన సరస్వతీక్షేత్రంలో మహర్నవమిన ఘనంగా జరిగిన నవచండీహోమ పూర్ణాహుతి, పాల్గొన్న రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిజీ.

* మహబూబ్ నగర్ జిల్లా..  జడ్చర్ల మండలం నసురుళ్లబాద్ చెరువులో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు  జంగయ్య(48) అనే వ్యక్తి మృతి.

* శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేత

ఇన్ ఫ్లో : 67,975 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 94,374 క్యూసెక్కులు, పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు , ప్రస్తుతం  : 884.80  అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు, ప్రస్తుత : 214.8450 టీఎంసీలు , కుడి,ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

* ఏపీ.. శ్రీశైలంలో ఎనిమిదవ రోజుకు చేరుకున్న దసరా మహోత్సవాలు. ఉత్సవాలల్లో భాగంగా నేడు అమ్మవారికి మహాగౌరి అలంకారం. స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ.

* హైదరాబాద్.. కూకట్ పల్లి నియోజక వర్గంలోని 105 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముభరక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు.