స్పీడ్ న్యూస్ @ 6 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 6 pm* కరీంనగర్: ఇళ్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం. పాల్గొన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయ.

* సూర్యాపేట జిల్లా : మద్దిరాల మండలంలో ఎర్రపాడు ఎక్స్ రోడ్ దగ్గర యూపీకి చెందిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు. 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న మద్దిరాల ఎస్ఐ బండి సాయి ప్రసాద్.

* యాదాద్రి జిల్లా :  రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమo లలో భాగంగా నూతనంగా నిర్మిచిన  వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, రూ.30 లక్షలతో సీసీరోడ్స్ లను  ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

* సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన పిట్టల పాపయ్య(90) ఐరిస్ సమస్యతో బాధపడుతున్న ఆ కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.50 వేల ఆర్థికసాయం అందజేసి ఆకుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్.

* భద్రాద్రి కొత్తగూడెంజిల్లా.. పాల్వంచ హోటల్ క్రిష్ణ లాడ్జ్ లో సీతారామ్ (20) అనే  వ్యక్తి అనుమానస్పద మృతి.

* నారాయణపేట జిల్లా… నారాయణపేట మండలం బండగొండ దగ్గర ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ఉటకుంటా తండా నుండి బండగొండ వైపు వెళ్తున్న మోపెడ్ లో తరలిస్తున్న 5లీటర్ల నాటుసారా పట్టివేత. ఒకరి అరెస్ట్. మోపెడ్ స్వాధీనం చేసుకున్న నారాయణపేట ఎక్సైజ్ పోలీసులు.

* నారాయణ్ పేట్ జిల్లా… మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామం దగ్గర శ్రీ లక్ష్మీ దుర్గ ఆంజనేయ జిన్నింగ్ మిల్ ను ప్రారంభించిన ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్ రెడ్డి, S రాజేందర్ రెడ్డి, జడ్పీ చెర్ పర్సన్ వనజ.

* నిర్మల్ జిల్లా.. కడెం పెద్ధుర్ గ్రామంలో  ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణి చేసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్.

* సూర్యాపేట జిల్లా..  తిరుమలగిరి మార్కెట్ యార్డులో  హమాలీలకు, దడు వాయిలకు బట్టలు పంపిణీ చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజని రాజశేఖర్, వైస్ చైర్మన్  రఘునందన్ రెడ్డి  ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.