స్పీడ్ న్యూస్ @ 7 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 7 pm* నిజామాబాద్ జిల్లా.. ఎడపల్లి పోలిస్టేషన్ లో విచారణ కోసం రెండు రోజుల కస్టడీలో తీన్మార్ మల్లన్న.

* హైదరాబాద్.. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 37వ సబ్ జూనియర్ బాలుర జాతీయ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ ను  ప్రారంభించిన  క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ముఖ్య అతిధులుగా హాజరైన శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, జాతీయ హ్యాండ్ బాల్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.

* జగిత్యాల.. ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపల్లి  వరద కాలువ  వద్ద ఆర్టీసీ బస్సు ఆటో-ఢీ.పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు మెట్పల్లి ఆస్పత్రికి తరలింపు.

* హైదరాబాద్.. యూసుఫ్ గూడ బస్తి దవాఖాన ప్రాంతాన్ని సందర్శించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, స్థానిక కార్పొరేటర్. యూసుఫ్ గూడ బస్తీలో ఉన్న బస్తి దవాఖాన ముందు ఉన్న ప్రదేశాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే జిహెచ్ఎంసి అనుమతితో ఇక్కడ ప్రహరీ గోడ కట్టిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు.

* మహబూబ్ నగర్..  మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని తిమ్మాసాని పల్లి  బిసి కాలనీ నుండి ఎర్రవల్లి తాండా వరకు  22.7 లక్షల రూపాయల వ్యయంతో 3 కిలోమీటర్ల నిడివి గల మెటల్  రహదారి పనులను  ప్రారంభించిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

* కరీంనగర్: వీణవంక మండలం ఘన్ముకులలో ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమన్వయ సమావేశం. పాల్గొన్న ఎంపీటీసీ సంజీవరెడ్డి, జీహెచ్ఎంసీ రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి.

* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పిఎం కేర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 500 లీటర్ల LPM ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి.

* జోగులాంబ గద్వాల జిల్లా.. అల్లంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.

* నారాయణపేట జిల్లా.. నారాయణపేట పట్టణంలోని పురపాలక సంఘం ప్రత్యేక నిధులతో సుమారు కోటి రూపాయల తో నిర్మించే వైకుంఠ దామనికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి.

* యాదాద్రి భువనగిరి జిల్లా:  భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో  మైక్రో చిప్ ఏర్పాటు చేసి  వినియోగదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం. చిప్ ద్వారా 5 లీటర్ల కు 150ml పెట్రోల్ తక్కువ వచ్చేలా ఏర్పాటు చేసినట్లు గుర్తించిన జిల్లా లీగల్ మెట్రాలజీ  అధికారి సీఐ కిషన్.

* నల్గొండ లోని చారిత్రక ఆలయం పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌదర రాజన్. పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికిన అర్చకులు. ఆలయంలో స్వామి వారికి బిల్వార్చన , అభిషేకం పూజలు నిర్వహించిన గవర్నర్. అనంతరం ఆశీర్వచనాలు అందించిన అర్చకులు. ప్రముఖ చరిత్ర పరిశోధకులు సూర్య కుమార్ గారు ఆలయ విశిష్టతను, శివలింగం పై అనునిత్యం పడే ఛాయా మహిమను గవర్నర్ కు వివరించారు.

* హనుమకొండ జిల్లా.. హన్మకొండలోని చారిత్మక వెయ్యి స్తంభాల దేవాలయంలో దేవినవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన సీపీ డా. తరుణ్ జోషి, వెయ్యి స్తంభాల గుడి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ.

* ఆదిలాబాద్ జిల్లా.. జిల్లా  కేంద్రంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న డిగ్రీ కళాశాల విద్యార్థులు.

* ఖమ్మం జిల్లా.. సాగర్ ఎడమ కాల్వలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం. కూసుమంచి మండలం, నాయకన్ గూడెం ఇన్ ఫాల్ రెగ్యులేటర్ వద్ద వెలికి తీయించిన కూసుమంచి పోలీసులు. మృతులిద్దరు పురుషులని , 35 నుంచి 40 సంత్సరాల వయస్సు ఉంటుందని తెలిపిన పోలీసులు.

* భద్రాద్రికొత్తగూడెం జిల్లా.. అశ్వారావుపేట లో మైనర్ పై ఓ యువకుడు లైంగిక దాడి. వీడియో తీసిన మరో యువకుడు. ఇద్దరి యువకులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.

* నల్గొండ జిల్లా.. నల్గొండ లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పర్యటించిన గవర్నర్ తమిలి సై సౌదర రాజన్. యూనివర్సిటీ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి.. మొక్కలు నాటి, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిలి సై సౌదర రాజన్.  అనంతరం యూనివర్సిటీ  బోర్డ్ మీటింగ్ నిర్వహించిన గవర్నర్.