స్పీడ్ న్యూస్ @ 8 pm - TNews Telugu

స్పీడ్ న్యూస్ @ 8 pm* నాగర్ కర్నూలు జిల్లా : పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ లో ట్రాక్టర్. బైక్ ఢీకొని ఒకరి మృతి. మరొకరికి తీవ్రగాయాలు.

* జోగులాంబ గద్వాల జిల్లా.. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ మూడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాలతో అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

* నాగర్ కర్నూల్ జిల్లా:  కొల్లాపూర్ మండలం అమరగిరి గుండెo గ్రామానికి చెందిన పురుస బయన్న( 22) అనే వ్యక్తి రెండు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి మృతి.

* నిజమాబాద్ : నగరపాలక సంస్థ అధ్వర్యంలో ఘణంగా బంతుకమ్మ వేడుకలు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త.

* భద్రాద్రికొత్తగూడెం జిల్లా..  కొత్తగూడెం, రామవరం గోధుమ వాగు బ్రిడ్జిపై లారీ బైక్  ఢీ.  డి.సి.ఆర్.బి. ఎ.ఎస్.ఐ సురేష్ మృతి.

* నారాయణ్ పేట్ జిల్లా… ఊట్కూర్ మండలంలో ని మల్లెపల్లి గ్రామం నుండి బిజ్వార్ గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న 4 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది. ఊట్కూర్ పోలీస్ స్టేషన్ తరలింపు,4 ఇసుక ట్రాక్టర్ లపై కేసు నమోదు.

* నారాయణ్ పేట్ జిల్లా… ఊట్కూర్ మండలంలోని తిమ్మ రెడ్డి పల్లి తండా గ్రామంలో వ్యవసాయ పొలంలో చదును చేస్తుండగా ట్రాక్టర్  అదుపుతప్పి బోల్తాపడి గణేష్ (16) అనే యువకుడు మృతి.

* జోగులాంబ గద్వాల జిల్లా..  వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో.. శాంతినగర్ సిఐ ఆధ్వర్యంలో 12 మంది ఎస్ఐలు 45  మంది సిబ్బంది సహాయంతో శాంతి నగర్ లోని జమ్మలమడుగు కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు.

* పెద్దపల్లి జిల్లా… టిఆర్ఎస్ పార్టీలో చేరిన 27వ డివిజన్ బిజెపి కార్పొరేటర్  కాల్వల శిరీష సంజీవ్. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చందర్ సమక్షంలో 200 మంది కార్యకర్తలతో టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన బిజెపి కార్పొరేటర్. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్.

* రాచకొండ కమిషనరేట్.. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, కౌకూర్ భరత్ నగర్ లో మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి, అడిషనల్ డీసీపీ శివకుమార్ ఆధ్వర్యంలో  300 మంది పోలీసులతో నడుస్తున్న కార్డ్& సర్చ్.

* కరీంనగర్: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో మంత్రి హరీష్ రావు సమక్షంలో జాయినింగ్స్ కార్యక్రమం. మాజీ సర్పంచ్ వసంతసమ్మిరెడ్డి, ఇద్దరు మాజీ ఉప సర్పంచులు సహా 50 మంది బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిక.. పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి.

* జోగులాంబ గద్వాల జిల్లా..  అయిజ మున్సిపాలిటీ R&B గెస్ట్ హౌస్ సమీపంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మొక్కలను పక్క రాష్ట్రం అయినటువంటి ఏపీకి చెందిన అమీలియే హస్పిటల్ కు చెందిన ఫ్లెక్సీ ప్రజలకు కనబడడం లేదని హరితహారం మొక్కలను నరికి వేయడం జరిగింది. ఇది గమనించిన మున్సిపాలిటీ కమిషనర్ హాస్పిటల్ యజమాని పై రూ.50 ఫైన్ వెయ్యడం జరిగింది.

* మేడ్చల్: దుండిగల్ పియస్ పరిదిలో 4గురు బైక్ దొంగల అరెస్ట్. ఇద్దరు పరారీ. వారినుండి 24 బైకులు స్వాధీనం. రిమాండ్ కు తరలింపు. నిందితులనుండి బైక్ లు కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరి అరెస్ట్.

* రాజన్న సిరిసిల్ల జిల్లా.. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు, స్వామివార్లకు లలిత సహస్ర నామ అష్టోత్తర శతనామ సహిత చత్యుష్ట పూజలు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అర్చకులు.

* హనుమకొండ :  ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ మండలంలోని మర్రిపెళ్లి గూడెం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి గెల్లు శ్వేతా.

* కరీంనగర్: వీణవంక మండలం ఘన్ముకులలో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం. పాల్గొన్న ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి.

* కరీంనగర్: వీణవంక మండలం మల్లన్నపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం, పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.

* రంగారెడ్డి జిల్లా.. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం.. ఒకరు 60 ఏళ్ల వృద్ధుడు, మరొక వ్యక్తి  సుమారు 45 సంవత్సరాలు కలిగి ఉంటాడు.. సంఘటన స్థలానికి శంకర్పల్లి పోలీసులు, వికారాబాద్ రైల్వే పోలీసులు చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని వారి వివరాలను సేకరిస్తున్నారు.

* రాజన్న సిరిసిల్ల జిల్లా.. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు.

* రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం లోకల్ ఉచిత బస్ ను ప్రారంభించిన స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, ఈ  కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, డిపో మేనేజర్ భూపతిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

* సూర్యాపేట జిల్లా .. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే గారి నివాసంలో 9 మండలాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు ₹25,78,500 వేల రూపాయలు  సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్.

* కరీంనగర్ జిల్లా.. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలోని దళిత వాడ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రచారం. కోలాటాలు, డప్పు చప్పుళ్ళ తో ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు. టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.

* వికారాబాద్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గ :-దౌల్తాబాద్ మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన తలారీ మధావులు, బండ్రి హనుమత్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి ద్వారా ఎమ్మేల్యే పట్నం నరేందర్ రెడ్డి CMRF (38,000/- రూపాయల) చెక్కును అందించారు.

* హనుమకొండ : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ మండలంలోని మర్రిపెళ్లి గూడెం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్.

* హనుమకొండ జిల్లా.. హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.