శ్రీదేవి ముద్దు కోసం నోరు కడుక్కొని వెళ్లిన హీరో.. కనీసం పలకరించకుండా వెళ్లిపోయిన అందాల నటి - TNews Telugu

శ్రీదేవి ముద్దు కోసం నోరు కడుక్కొని వెళ్లిన హీరో.. కనీసం పలకరించకుండా వెళ్లిపోయిన అందాల నటిSridevi is the hero who washed his mouth for a kiss .. at least the beauty actress who left without being greeted
Sridevi is the hero who washed his mouth for a kiss .. at least the beauty actress who left without being greeted

శ్రీదేవి అంటే ఇష్టపడని యువకులుండరు. సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలు సైతం ఆమె అంటే పడి చచ్చేవారు. తనతో ఒక్క సినిమా తీసినా చాలని దర్శక నిర్మాతలు, ఆమెతో కలిసి నటించాలని హీరోలు ఉవ్విళ్లూరేవారు. ఇక యువ హీరోలకైతే ఆమె అందని తార. అయితే.. అర్ధాంతరంగా ఆమె మన మధ్యలోంచి వెళ్లిపోయినా.. ఆమెకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు ఆమెను నిత్యం గుర్తు చేసుకునేలా చేస్తాయి. ఆమెతో కలిసి నటించాలని ఎదురుచూసిన హీరోలు, దర్శకుల్లో అప్పటి యువ దర్శకుడు, హీరో జేడీ చక్రవర్తి కూడా ఒకరు. రామో గోపాల్ వర్మ శిష్యుడిగా పని చేసి.. శివ సినిమాతో తెరకు పరిచయమైన జేడీ చక్రవర్తి తన తొలి సినిమాతోనే శ్రీదేవి దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు.

Sridevi is the hero who washed his mouth for a kiss .. at least the beauty actress who left without being greeted
Sridevi is the hero who washed his mouth for a kiss .. at least the beauty actress who left without being greeted

శ్రీదేవి అంటే రామ్ గోపాల్ వర్మకు ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. వర్మకు తెలియకుండా జేడీ ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడట. ఆర్టిస్టుగా మంచి పేరుసంపాదించిన జేడీ క్షణక్షణం సినిమాలో శ్రీదేవితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఆ తర్వాత జేడీ నటించిన మనీ మూవీ చూసి శ్రీదేవి ఆయనకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చిందట. నేనిప్పటి వరకు చూసిన మంచి నటుల్లో చక్రవర్తి కూడా ఒకరు అని అనడంతో జేడీ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడట. ఆ ఆనందంలోనే క్షణక్షణం సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి దగ్గరికి వెళ్లి పలకరించాడట. అప్పటికే షాట్ రెడీ అవడంతో జేడీ పలకరింపునకు సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిందట ఆ అతిలో సుందరి. మంచి నటుడు అని కాంప్లిమెంట్ ఇచ్చింనందుకు ముద్దు పెడుతుందేమో అని నోరు కూడా కడుక్కుని వెళ్లా.. ముద్దు కాదు కనీసం హగ్ కూడా లేదు. చివరికి నా పలకరింపు విని రిప్లై ఇవ్వకుండానే వెళ్లిపోయింది అని జేడీ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో అందాల నటి దివంగత శ్రీదేవితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.