బంగ్లాదేశ్ బాగా ఆడింది.. శ్రీలంక లక్ష్యం 172 పరుగులు

Srilanka Need 172 Runs In 20 Overs
Srilanka Need 172 Runs In 20 Overs

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ శ్రీలంకకు మంచి లక్ష్యాన్నే నిర్దేశించింది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా 171 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్ మెన్లు మొహమ్మద్ నయీం, ముష్ఫిఖర్ రహీంల అధ్భుతమైన బ్యాటింగ్ తో బంగ్లా మంచి స్కోర్ చేసింది.

Srilanka Need 172 Runs In 20 Overs
Srilanka Need 172 Runs In 20 Overs

ఓపెనర్లుగా బరిలోకి దిగిన నయీం 52 బంతుల్లో 62 పరుగులు చేసి బంగ్లా స్కోరుబోర్డుకు వెన్నెముకగా నిలిచాడు. మరో ఓపెనర్ లిటన్ దాస్ 16 బాల్స్ ఆడి.. 16 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన షకీబ్ ఉల్ హసన్ జస్ట్ 10 పరుగులు చేసి వెనుదిరగగా.. స్కోర్ బోర్డు వేగాన్ని పెంచే బాధ్యత ముష్ఫిఖర్ రహీం తీసుకున్నాడు. విధ్వంసకరబ్యాటింగ్ తో 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 57 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే, ఫెర్నాండో, లహీరు కుమారలు తలా ఓ వికెట్ తీసుకున్నారు.