ఖమ్మం కార్పొరేషన్ కు రాష్ట్రస్థాయి అవార్డు

Khammam Corporation

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యేకతను చూపించిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. ఈ అవార్డును మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా హైదరాబాదులో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి  కేటీఆర్ మాట్లాడారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ను ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని అన్నారు. మంత్రి అజయ్ సారథ్యంలో తీసుకుంటున్న నిర్ణయాలు నగరాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని తెలిపారు. ఖమ్మం ఎమ్మెల్యేగా, మంత్రిగా మున్సిపల్ పాలకవర్గానికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారని అన్నారు. ఆవార్డు అందజేసి మంత్రి అజయ్ కి అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్.