గణపతి బప్పా మోరియా అంటే అర్థమేంటో తెలుసా? - TNews Telugu

గణపతి బప్పా మోరియా అంటే అర్థమేంటో తెలుసా?Story Behind Tha Ganesh Bappa Moria Slogan
Story Behind Tha Ganesh Bappa Moria Slogan

దేశమంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేష్ మహారాజ్ కి జై.. గణపతి బప్పా మోరియా అంటూ గల్లీలన్నీ హోరెత్తిపోతున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా గణపతి బప్పా అంటూ జై కొడుతున్నారు. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చేసి చివరి రోజు వీడ్కోలు పలుకుతూ గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు. అయితే.. నవరాత్రుల పూజల్లో.. నిమజ్జన ర్యాలీలో అందరి నోటా మార్మోగే జయనాదం ఒక్కటే. అదే.. గణపతి బప్పా మోరియా. ఇంతకీ ఈ గణపతి బప్పా మోరియా అంటే అర్థం ఏంటి? ఆ పదం ఎలా పుట్టింది? తెలియాలంటే ఈ కథ చదవండి.

Story Behind Tha Ganesh Bappa Moria Slogan
Story Behind Tha Ganesh Bappa Moria Slogan

పూర్వరోజుల్లో చక్రపాణి అనే రాక్షస జాతికి చెందిన రాజు ఉండేవాడు. అతని భార్య ఉగ్ర. చక్రపాణి గండకీ అనే రాజ్యాన్ని పాలించేవాడు. సంతానం కోసం చింతిస్తూ నిత్యం పూజలు, వ్రతాలు చేసేవారు. వీరికి శానక ముని అనే రుషి కలిసి… సూర్యోపాసన చేయాలని సూచిస్తాడు. ఆ ముని మాటలు పాటించి ఆ భార్యాభర్తలు సూర్యోపాసన చేయగా ఉగ్ర గర్భం దాలుస్తుంది. అయితే.. కడుపులో ఉన్న బిడ్డ సూర్యుడంతటి శక్తివంతుడు కావడంతో ఆ వేడిని భరించలేక ఉగ్ర ఆ గర్భాన్ని సముద్రంలో వదిలేస్తుంది.

Story Behind Tha Ganesh Bappa Moria Slogan
Story Behind Tha Ganesh Bappa Moria Slogan

సముద్రుడు ఆ గర్భంలోని శిశువును తీసుకొచ్చి తిరిగి ఉగ్రకు అప్పగిస్తాడు. సూర్యుడి అంశతో పుట్టిన ఆ పిల్లవాడు మిలమిల మెరుస్తూ తేజోవంతంగా ఉంటాడు. చక్రపాణి, ఉగ్ర దంపతులు ఆ పిల్లాడికి సింధురాసురుడు అని పేరు పెడుతారు. పెరిగి పెద్దైన తర్వాత సూర్యుడిని ఉపాసిస్తాడు. తపోఫలితంగా సింధు సూరయుడి నుంచి అమృతాన్ని పొందుతాడు. అమృతం మహిమ వల్ల అమరుడవుతాడు. చావు లేకపోవడం వల్ల ముల్లోకాలను జయించాలనుకుంటాడు సింధురాసురుడు.

Story Behind Tha Ganesh Bappa Moria Slogan
Story Behind Tha Ganesh Bappa Moria Slogan

ఈ ఆలోచన రాగానే సింధురాసురుడు దేవతలందరినీ కారాగారంలో బంధిస్తాడు. ముప్పై మూడు కోట్ల దేవతలను జయించిన సింధురాసుడు. కైలాసం, వైకుంఠాన్ని కూడా జయించేందుకు బయల్దేరుతాడు. అతడి బాధలు పడలేక పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతంలో కాపురముంటారు. లక్ష్మీ, విష్ణుమూర్తి కలిసి గండకీ రాజ్యంలో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవతల గురువైన బృహస్పతి ఒక ఉపాయం చెప్తాడు. సింహరూఢుడు, పది తలలు కలిగిన గణపతిని ఆరాధించమని సూచిస్తాడు. దేవతలు బృహస్పతి సలహాను పాటించి అలాగే చేస్తారు. దేవతల తపస్సును మెచ్చిన గణపతి పది తలలతో సింహరూఢుడై వచ్చి.. పార్వతీ గర్భాన జన్మించి దేవతలను కాపాడుతానని వరమిస్తాడు. మేరు పర్వతం మీద పన్నెండు ఏండ్లుగా వినాయక మంత్రాన్ని జపిస్తున్న పార్వతి దేవి తపస్సుకు మెచ్చి ఆమెకు కొడుకుగా పుడుతానని వరం ఇస్తాడు.

Story Behind Tha Ganesh Bappa Moria Slogan
Story Behind Tha Ganesh Bappa Moria Slogan

ఇదిలా ఉండగా.. ఒకరోజు సింధురాసురుని మిత్రుడు కమలాసురుడు శివునిపై యుద్ధానికి వస్తాడు. అప్పుడు గణేశుడు కమలాసురుడితో పోరాడుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. కమలాసురుడి రక్తం నుంచి వేలకొలది రాక్షసులు పుడుతుంటారు. ఎంత యుద్ధం చేసినా రాక్షసులు పుడుతూనే ఉంటారు. దీంతో.. గణేశుడు సిద్ధి, బుద్ధి అనే శక్తులను సృష్టిస్తాడు. వారు ప్రత్యక్షమై కమలాసురుడి నెత్తురు నుంచి పుడుతున్న రాక్షసులను సంహరిస్తుంటారు.

Story Behind Tha Ganesh Bappa Moria Slogan
Story Behind Tha Ganesh Bappa Moria Slogan

అదే అదునుగా గణపతి కమలాసురుడి తల నరికివేస్తాడు. ఆ తర్వాత సింధురాసురుడి దగ్గరకు వెళ్లి దేవతలను విడిచిపెట్టాలని కోరుతాడు. అందుకు సింధురాసురుడు అస్సలు ఒప్పుకోడు. దీంతో ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. మూడురోజుల పాటు ఆగకుండా యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో గణపతి సూక్ష్మరూపంలోకి మారి సింధురాసురుడి పొట్టపై బాణం వేస్తాడు. సింధురాసురుడి పొట్టలోంచి అమృతభాండం బయటపడుతుంది. సింధురాసురుడు చనిపోతాడు.

Story Behind Tha Ganesh Bappa Moria Slogan
Story Behind Tha Ganesh Bappa Moria Slogan

కమలాసురుడి తల నరికినప్పుడు అది ఎగిరి వెళ్లి మోర్గాం (పూణె) అనే ప్రాంతంలో పడుతుంది. ఆ రాక్షసుడి తల పడిన ప్రదేశంలోనే దేవతలంతా గణేశుడి విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తాడు. అలా మోర్గాం గణేశుడు వెలిసిన పుణ్యక్షేత్రంగా మారింది. ఆ యుద్ధం చేసేటప్పుడు గణపతి నెమలి మీద ఎక్కి పోరాడుతాడు. దీంతో ఆయనకు మయూరేశ్వర్ అని కూడా కీర్తిస్తూ పూజిస్తారు. మరాఠీలో నెమలిని మోర్ అంటారు.

Story Behind Tha Ganesh Bappa Moria Slogan
Story Behind Tha Ganesh Bappa Moria Slogan

ఆ ప్రాంతం పేరు మోర్గాం. బప్పా అంటే.. అయ్యా అని అర్థం. అలా.. దేవతలను కాపాడటంతో అందరూ కలిసి గణపతి బప్పా మోరియా అంటూ జయజయధ్వానాలు చేస్తారు. అలా అప్పటి నుంచి గణపతి బప్పా మోరియా అనేది గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మార్మోగుతోంది. మోర్గాంలో వెలిసిన గణపతిని మోరేశ్వర్, మోరియా అంటూ పిలుస్తారు. ఇదీ.. గణపతి బప్పా మోరియా వెనుక ఉన్న అసలు కథ.