స్కూటీ డిక్కీలోంచి వింత శబ్దాలు.. తెరిచి చూసి షాక్.. వీడియో

snake-entered-in-scooty

మహబూబాబాద్‌ జిల్లాలోని ఓ గవర్నమెంట్ స్కూల్ లో ఓ వింత సంఘటన జరిగింది. దీంతో సుమారు రెండు గంటలపాటు టీచర్లు, స్టూడెంట్స్ భయంతో వణికిపోయారు.

కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ స్కూల్ లో రోజు మాదిరిగానే ఓ టీచర్ స్కూటీని పార్కింగ్‌ చేసింది. అయితే అందులోంచి వింత శబ్దాలు వస్తుండటంతో ఏంటా అని కొందరు స్టూడెంట్స్ షాకయ్యారు. తాచుపాము బుసలు కొడుతుంది.

విషయాన్ని టీచర్ చెప్పగా.. కొందరు స్టూడెంట్స్ కట్టెలు తెచ్చి బండిని కొట్టి సౌండ్ చేసి చూశారు. అయినా పాము బయటకు రాలేదు. దీంతో పాములు పట్టే వారిని పిలిపించారు.

వారు కూడా ఎంత ప్రయత్నించినా పాము మాత్రం బయటకు రాలేదు. దీంతో బండిని విప్పేందుకు మెకానిక్ ను రప్పించారు. అందరూ కష్టపడి స్కూటీ ఒక్కో పార్టును తొలగించారు.

చివరకు వీళ్లందరి శ్రమ ఫలించింది. దాదాపు రెండు గంటల తర్వాత పాము మెల్లిగా బుసలు కొడుతూ బయటకు వచ్చింది. అంతే స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని.. అడవీలో వదిలేయ్యడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.