రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తే ఊరుకోం.. బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన స్టూడెంట్ జేఏసీ లీడర్స్

Student JAC leaders

Student JAC leaders

హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఓయూ జేఏసీ, శాతవాహన జేఏసీ విద్యార్థి నాయకులు మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా బిడ్డ గెల్లు, జైలు జీవితం గడిపిన విద్యార్థి, విద్యార్థి నాయకున్ని గెలిపించుకుందామన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం దేశాన్ని ప్రశ్నిస్తామన్నారు. బీజేపీ గెలిచి ఏం సాధిస్తుంది, గెలిచిన రఘునందన్, బండి సంజయ్, అరవింద్ ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేగా విద్యార్థి నాయకునికి, ఉద్యమకారునికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. గెల్లును గెలిపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్పొరేటర్ స్థాయి వ్యక్తిని ఎంపీ చేస్తే కేంద్రం నుండి ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తే ఊరుకోమని, తాము కూడా కన్నెర్ర చేస్తామని హెచ్చరించారు. ఉస్మానియా లో నాగం జనార్దన్ కు పట్టిన గతి మీకు పడుతుందని ఓయూ జేఏసీ నాయకులు బీజేపీ నేతలను హెచ్చరించారు.