కామన్వెల్త్‌లో చరిత్ర సృష్టించిన సుధీర్

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌ పతకాల వేట కొనసాగిస్తోంది. తాజాగా పారా పవర్‌ లిఫ్టింగ్‌ ఈవెంట్‌లో సుధీర్‌ భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. గురువారం (ఆగస్టు4) అర్ధరాత్రి జరిగిన పురుషుల హెవీవెయిట్ విభాగంలో సుధీర్ 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు భారత్‌ బంగారు పతకాల సంఖ్య 6కు చేరగా.. మొత్తం పతకాల సంఖ్య 20కి చేరుకుంది. ఇందులో 7 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.