పారా ప‌వ‌ర్ లిఫ్టింగ్ లో భార‌త లిప్టర్ సుధీర్ కు గోల్డ్‌ మెడల్‌

Para Powerlifting-Sudhir

కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల లిస్టులో మరో గోల్డ్ మెడల్ వచ్చిచేరింది.  పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. తొలి ప్రయత్నంలోనే 208 కేజీల బరువెత్తిన సుధీర్‌.. రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 134.5 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది.