సుకన్య సమృద్ధి యోజన: ఈ పథకంతో రూ.71 లక్షల వరకు లబ్ధి

Sukanya Samriddhi Yojana: Benefit up to Rs. 71 lakh under this scheme

ఆడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పొదుపు పథకం సుకన్య సమృద్ది యోజన పథకం. ఆడపిల్లల చదువు, పెళ్లి అవసరాలకు సహాయపడే విధంగా రూపొందించిన ఈ పథకం వారి తల్లిదండ్రులకు ఒక వరమనే చెప్పాలి. బేటీ బచావో, బేటీ పడావో ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. డిఫాల్ట్ లేకుండా మెచ్యూరిటీ అయ్యే దాకా నిర్ణీత సొమ్ము కడితే.. ఖాతా ముగిసే సమయానికి సమయానికి రూ.71 లక్షల వరకు లబ్ధి చేకూరే అవకాశమున్న ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం.

ఎంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు?

మీరు కేవలం 250 రూపాయలకే సుకన్య సమృద్ధి యోజనతో ఖాతాను తెరవొచ్చు. మరో మాటలో చెప్పాలంటే.. మీరు రోజుకు 1 రూపాయి కంటే తక్కువ పెట్టుబడి లేదా.. ఆదా చేసుకుంటే.. ఆ ప్లాన్ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరం అంటే.. ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అని అర్థం. సంవత్సరానికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. ఇంకా ఎక్కవు పొదుపు చేయాలనుకుంటే.. రూ.1.5 లక్షల వరకు పెట్టుకోవచ్చు. ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకూ డబ్బు క్రమం తప్పకుండా జమ చేయాలి. డిపాటిజ్ ఒక్కసారి లేదా వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. ఉదాహరణకు డిఫాల్ట్ లేకుండా నెలకు రూ.1000 (ఏడాదికి రూ.12,000)కడితే మెచ్యూరిటీ సమయానికి సుమారు 5 లక్షల రూపాయలు అందుతాయి. డిఫాల్ట్ లేకుండా నెలకు రూ.12,500 వేలు 15 ఏళ్ల పాటు కడితే, మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ. 71 లక్షల వరకూ వస్తుంది.

ఎంత డబ్బు వడ్డీ అవుతుంది?

ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజనపై 8.4 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. వడ్డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక ఆడపిల్లకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేక సందర్బాల్లో డబ్బులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మెచ్యూరిటీ అంటే 21 సంవత్సరాలు తీరిన తర్వాత డిపాటిట్ చేసిన డబ్బులతో పాటు.. వడ్డీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రతీ నెల 10 వ తారీఖు లోపు డబ్బులను డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత బాలిక ఉన్నత విద్య కోసం 50 శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ టైము 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా డబ్బు తీసుకోకపోతే అకౌంట్ మొత్తంపై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. తల్లిదండ్రులు లేదా గార్డియన్ వేరే ఊరు బదిలీ అయితే వాళ్లు తమ సుకన్య సమృద్ధి పొదుపు ఖాతాను దేశంలో ఎక్కడికైనా ఉచితంగా బదిలీ చేసుకోవచ్చు.

నెలకు రూ. 3000 డిపాజిట్ చేస్తే..

ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం రూ. 250 జమ చేయకపోతే, ఆ ఖాతా డిఫాల్ట్‌గా పరిగణించబడుతుంది. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తికాకముందే డిఫాల్ట్ ఖాతాను పునరుద్ధరించవచ్చు. దీని కోసం, ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి రూ. 50 డిఫాల్ట్‌ పెనాల్టీతో కనీసం రూ. 250 చెల్లించాలి.

ఇక ఈ పథకంలో నెలకు రూ. 3000 డిపాజిట్ చేస్తే.. సంత్సరానికి 36, 000 రూపాయలు పెట్టుబడి పెడితే.. 14 ఏళ్ల తర్వాత వార్షిక చక్రవడ్డీ రూ.9,11,564 అవుతుంది. 21 సంవత్సరాలలో అంటే, మెచ్యూరిటీ సమయంలో ఈ డబ్బు దాదాపు 15,22,221 రూపాయలు అవుతుంది.

ఖాతాను ఎలా తెరవాలంటే..?

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో తెరవవచ్చు. ఈ ఖాతాను బిడ్డ పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వరకు తెరవవచ్చు. ఖాతా తెరిచే సమయంలో ధరఖాస్తుదారుని ఐడి ప్రూఫ్‌ , అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్​ కార్డు, బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి. వీటి జిరాక్స్ లన్నింటినీ జత చేసి దరఖాస్తు పత్రాన్ని పోస్టాఫీసులో అందజేయాలి. సంబంధిత దరఖాస్తుతోపాటు చెక్, డ్రాఫ్ట్ లేదా క్యాష్ రూపంలో ప్రారంభ మొత్తం (ఇనీషియల్ అకౌంట్) కట్టాలి. ప్రతీ ఆథరైజ్డ్ బ్యాంకుల్లో కూడా ఈ పొదుపు పథకం ఖాతా తెరవచ్చు