సన్ రైజర్స్ టార్గెట్ 20 ఓవర్లలో 236 పరుగులు

ముంబై ఇండియన్స్ 235 పరుగులు కొట్టి సన్ రైజర్స్ హైదరాంబాద్ కి భారీ లక్ష్యాన్నిచ్చింది. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ బౌండరీల వర్షంతో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు కొట్టగా.. సూర్య కుమార్ యాదవ్ 40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు.

 

ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 132 పరుగులు చేసిన ముంబై చివరి 10 ఓవర్లలో 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్‌ 4, రషీద్‌ ఖాన్‌ 2, ఉమ్రాన్‌ మాలిక్‌ 1 వికెట్‌ తీశారు.