ఈ ఆదివారం నుంచి చార్మినార్ దగ్గర కూడా ‘సండే- ఫ‌న్‌డే’ - TNews Telugu

ఈ ఆదివారం నుంచి చార్మినార్ దగ్గర కూడా ‘సండే- ఫ‌న్‌డే’Sunday- Funday start at Charminar

ట్యాంక్‌ బండ్‌పై ప్రతి ఆదివారం జరుగుతున్న ‘సండే- ఫ‌న్‌డే’ ఇకపై చార్మినార్ దగ్గర కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా.. చార్మినార్ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీపీ అంజ‌నీ కుమార్, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఇవాళ ప‌రిశీలించారు. వాహనాల పార్కింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ తదితర అంశాలను సమీక్షించారు.

చార్మినార్ దగ్గర కూడా సండే – ఫ‌న్‌డే నిర్వ‌హించాల‌ని మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించినట్లు అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇటీవ‌ల చెప్పిన సంగతి తెలిసిందే. స్థానిక ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న రావ‌డంతో చార్మినార్ దగ్గర సండే – ఫ‌న్‌డే నిర్వ‌హించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు.