బిగ్ బాస్ లో కొత్త ట్విస్ట్.. షణ్ముఖ్ తో సిరి బ్రేకప్.. సన్నీతో కొత్త లవ్ ట్రాక్.. ఏంటీ బరితెగింపు ?

Sunny Siri New Love Story Begins In Bigg Boss House
Sunny Siri New Love Story Begins In Bigg Boss House

బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీస్. కంటెస్టెంట్స్ మధ్యలో పుల్లలు పెట్టి గొడవలు సృష్టించి కొట్టుకునేలా చేయటమే బిగ్ బాస్ గేమ్. ఇక ఆడ మగ మధ్యలో లవ్ ఎఫైర్స్ కూడా బిగ్ బాస్ టీఆర్పీస్ కి ప్రధాన భూమిక పోషిస్తాయి. హౌస్ లోకి వెళ్ళగానే జంటలుగా మారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే పనిలో పడిపోతారు కంటెస్టెంట్స్. అలా బిగ్ బాస్ సీజన్ 5లో అందరి కళ్ళల్లో పడ్డ బిగ్ బాస్ లవ్ బర్డ్స్ సిరి షణ్ముఖ్. వీరిద్దరూ హౌస్ బయట కమిట్ అయినా వారే. ఇద్దరికీ లవర్స్ ఉన్నారు. కానీ హౌస్ లో ఈ జంట హద్దులు ధాటి హగ్గులు ఇచ్చుకుంటూ యూత్ క్రేజ్ దక్కించుకున్నారు. చేసేది తప్పని తెలిసి కంట్రోల్ అవ్వటంలేదని బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. వారిద్దరి కుటుంబ సభ్యులు కూడా వారించినా.. హౌస్ లో వీరి రొమాన్స్ మాత్రం ఎక్కడ తగ్గడంలేదు. అలాంటి ఈ జంట హగ్గుల కార్యక్రమాన్ని మించి మరొక అరాచకం తాజాగా బిగ్ బాస్ హౌస్ లో చోటుచేసుకుంది. సోషల్ మీడియా, ట్రోలర్స్ దిష్టి పోవాలంటూ డ్రామా క్వీన్ గా ముద్రపడ్డ సిరి షణ్ముఖ్ కి దిష్టి తీయటం.. సన్నీ, మానస్ తో సిరి దెగ్గరవుతుందని షణ్ముఖ్ మనస్తాపానికి గురవ్వటం, కోపంతో సిరిని తిడుతూ అనుమానించటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం వంటి దరిద్రాలన్నీ సోమవారం నాటి 93వ ఎపిసోడ్‌లో మనకి దర్శనమిస్తాయి. ఇక పైన చెప్పినవన్నీ పక్కనపెడితే.. సిరి సన్నీ మధ్యలో కొత్త లవ్ ట్రాక్ ఎమన్నా పుట్టుకొస్తుందా అని అనుమానం వచ్చేలా నిన్నటి ఎపిసోడ్ జరగటం అరాచకానికి అరాచకమనే చెప్పాలి.

సిరి తనతో కాకుండా హౌస్‌లో ఉన్న ఎవరితో క్లోజ్ అయినా ఇగో మాస్టర్ షణ్ముఖ్ అస్సలు తట్టుకోలేడని అందరికి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో సిరి మానస్, కాజల్, సన్నీలతో క్లోజ్‌గా ఉండటం చూసి పడుకున్న షణ్ముఖ్.. తట్టుకోలేక లేచి వేరే చోటుకి వెళ్ళిపోతాడు. అది చూసిన సిరి షణ్ముఖ్ దెగ్గరికి వస్తే గొడవకి దిగుతాడు. నువ్వు హౌస్ లో ఇద్దరితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నావని బయట ప్రచారం జరుగుతుందని హెచ్చరిస్తాడు. బయట జరుగుతుందో లేదో కానీ షణ్ముఖే సిరి క్యారెక్టర్ బ్యాడ్ అయ్యేలా      మాట్లాడుతున్నాడని మాత్రం నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇక సిరితో షణ్ముఖ్ మాట్లాడుతూ ‘నేను లేచి ఉంటే ఒకలా బిహేవ్ చేస్తావ్.. పడుకుంటే మరోలా బిహేవ్ చేస్తావ్’ అంటూ సిరి వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తాడు. ఇది అర్ధం కానీ సిరి మాత్రం అమాయకంగానే ఉండిపోతుంది. ఇంకో రెండు వారాలు ఆ తరువాత ఇవేం నాకు వద్దు.. ఎవడు గేమ్ ఆడుతున్నాడో నీకు తెలియదు.. ఎవరు కొత్తగా ట్రాక్‌లు మొదలు పెట్టాలనుకుంటున్నారో నీకు తెలియదు.. ’అని తెగ ఫీల్ అయిపోయాడు షణ్ముఖ్.

అయితే ఇక్కడే షణ్ముఖ్ అనుమానానికి బలం చేకూర్చేలా సిరి, సన్నీ మధ్యలో లవ్ ట్రాక్ స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్. మానస్, సన్నీ, కాజల్ ముగ్గురూ కిచెన్ దగ్గర కూర్చుని ఉండగా.. సిరి కుంటుకుంటూ అలా వెళ్తుంటుంది.. సన్నీ జాంబీ అని పిలుస్తాడు.. ఆమె ఇటు తిరిగే సరికి ఎంత క్యూట్‌గా తిరిగిందో అని సన్నీ అనగా.. ఇప్పుడు నీకు క్యూట్‌గానే ఉంటుందిలే అని అంటాడు మానస్. ఇంతలో సిరి సన్నీ రావటం.. సరదాగా అన్నయ్య అని పిలవమంటావా అని టీజ్ చేయటం.. నువ్వు పిలిస్తే ఆ షణ్ముఖ్ మొహం 1000వోల్ట్ బల్బు లా వెలిగిపోతుంది అని సన్నీ అనటం.. దానికి సిరి ముసిముసి నవ్వులు నవ్వటం..    ఈ కన్వర్జేషన్ అవుతుంటే.. పక్కనున్న మానస్, కాజల్ లవ్ సాంగ్ పాడుతూ.. అలియాభట్ సిరితో లవ్ అంటూ అరుపులు అరవటం.. వంటి అరాచక సీన్లు దర్శనమిచ్చాయి. అయితే ఇదంతా జరుగుతుంటే సిరి తనకి ఎక్కడ దూరం అవుతుందో.. సన్నీకి ఎక్కడ దగ్గర అవుతుందో అని తెగ బాధపడిపోవడాన్ని..  షణ్ముఖ్ క్లోజ్‌లు వేసి మరీ బిగ్ బాస్ చూపించటం గమనార్హం.