రజినీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..!

Super Star Rajinikanth To Get Dadasaheb Phalke Award On Oct 25
Super Star Rajinikanth To Get Dadasaheb Phalke Award On Oct 25
Super Star Rajinikanth To Get Dadasaheb Phalke Award On Oct 25
Super Star Rajinikanth To Get Dadasaheb Phalke Award On Oct 25

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగానికి ఇచ్చే ప్రతిష్టాత్మక  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని సొంతం చేసుకున్నాడు రజినీకాంత్. కేంద్ర ప్ర‌భుత్వం  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌కు ప్రకటించింది. గడిచిన నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి అందిస్తున్న సేవకి గుర్తింపుగా రజినీకి            ఈ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికి గానూ ఆయ‌న ఈ అవార్డును అందుకోనున్నారు. న‌టుడిగా, స్టార్ హీరోగా, సూప‌ర్‌స్టార్‌గా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఇలా ఆయ‌న త‌న‌దైన విశిష్ట‌త‌ను చాటుకున్నారు. అవార్డుని ప్రకటించిన అనంతరం మీడియాలో స్పదించాడు రజినీకాంత్. ఇంత గొప్ప అవార్డుని తనకి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపాడు రజినీకాంత్. అలాగే త‌న గురువు బాల‌చంద‌ర్ ఈ సమయంలో లేక‌పోవ‌డం బాధ‌గా ఉంద‌ని ఆయ‌న్ని గుర్తుకు చేసుకున్నారు రజినీకాంత్.