సూపర్‌ స్టార్‌ మమ్ముట్టికి కరోనా పాజిటివ్

Superstar Mammootty tests positive for COVID-19

దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రభావంతో కొవిడ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 2.71లక్షల కేసులు వెలుగుచూశాయి. రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా మలయాళీ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఇటీవల తేలికపాటి జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. ఆయన ఆరోగ్య స్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

మమ్ముట్టికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన వేగంగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సీబీఐ’ చిత్రం షూటింగ్‌ కోచ్చిలో జరుగుతుంది. మమ్ముట్టికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో చిత్రీకరణను రెండువారాల పాటు వాయిదా వేశారు.