నీట్ పీజీ కౌన్సిలింగ్ పై క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అప్పటి వరకు ఆగాల్సిందే

Supreme Court Orders To Central Government On NEET PG
Supreme Court Orders To Central Government On NEET PG
Supreme Court Orders To Central Government On  NEET PG
Supreme Court Orders To Central Government On NEET PG

ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు నీట్ పీజీ కౌన్సిలింగ్ ను ప్రారంభించమని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం నేడు నీట్ పీజీ కౌన్సిలింగ్ పై జరిపిన విచారణలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేసింది. రిజర్వేషన్లపై నిర్ణయం తేలకుండా.. కౌన్సిలింగ్ ప్రారంభిస్తే విద్యార్థులు సమస్యల్లో పడతారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నీట్ పీజీ ఆలిండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయిస్తూ గత జూలై 29న మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పీజీ మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు పాటించకుండా నీట్ పీజీలో రిజర్వేషన్లు కేటాయించారని కోర్టుకు నివేదిక సమర్పించారు.


నీట్ అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈరోజు నుంచి కేంద్రం నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే నీట్ పీజీ అభ్యర్థులు మరోసారి కోర్టు మెట్లెక్కారు. రిజర్వేషన్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునే వరకు కౌన్సిలింగ్ ఆపాలని చంద్రదూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ఆపేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. కాగా.. విద్యార్థుల తరపున న్యాయవాది అరవింద్ దాతార్ వాదించారు.