నీట్‌ పీజీ వాయిదా కుదరదన్న సుప్రీంకోర్టు

Supreme Court -NEET PG

వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్‌ పీజీ-2022 పరీక్ష వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. ఇలా వాయిదా వేసుకుంటూ పోతే డాక్టర్లు అందుబాటులోకి రాక ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని కోర్టు తెలిపింది. పరీక్ష వాయిదాతో 2.6 లక్షల మందికిపైగా విద్యార్థులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని.. రెండేళ్లుగా కరోనా  వైరస్ తో దెబ్బతిన్న పరీక్షల షెడ్యూల్‌ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని తెలిపింది. పరీక్ష వాయిదా కుదరదని సుప్రీ స్పష్టం చేసింది.

నీట్‌ పీజీ-2022 పరీక్ష ఈ నెల 21న జరగనుంది.