అస్కార్‌కు నామినేట్ అయిన జై భీమ్, మ‌ర‌క్కార్ సినిమాలు

Suriya's Jai Bhim and Mohanlal's Marakkar eligible for Best Feature Film at Oscars 2022

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అవార్డు ఆస్కార్. ఈ ఏడాది 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సౌత్ ఇండస్ట్రీ నుంచి రెండు సినిమాలు ఎంపికయ్యాయి. అందులో ఒకటి సూర్య నటించిన ‘జై భీమ్‌’ చిత్రం కాగా, మరోకటి మోహన్‌ లాల్‌ నటించిన ‘మరక్కార్‌’ చిత్రం. ఆస్కార్‌ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్‌ లిస్ట్‌ అవగా అందులో రెండు ఇండియన్‌ సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ సౌత్‌ ఇండస్ట్రీకి చెందినవే కావడం విశేషం.

గతేడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన జైభీమ్ సినిమా ప్రశంసలు అందుకుంది. జస్టిస్ చంద్రు నిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారం చేయబడిన తమిళ సినిమాగా గౌరవం దక్కించుకుంది. గిరిజనుల తరుపున న్యాయ పోరాటం చేసే లాయర్ పాత్రలో సూర్య నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇటీవలే ఈ సినిమా నోయిడా ఫిల్మ్ ఫేర్ పెస్టివల్‍కు ఎంపికయ్యింది.

ఇక మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన మరక్కార్ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రశంసలు దక్కాయి. చారిత్రక కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఆయా కేటగిరిలకు చెందిన ఫైనల్ నామినేషన్స్ ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి 27న అమెరికాలో జరగనుంది.