మియాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి

హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియపూర్ దీప్తిశ్రీనగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి సందీప్(42)…. ప్రమాదవశాత్తు నాలుగవ అంతస్థుపై నుండి తన లాప్ టాప్ తో సహా కింద పడి దుర్మరణం పాలయ్యాడు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.