T20 World Cup 2021: దక్షిణాఫ్రికాపై 5 వికెట్లతో గెలిచిన ఆస్ట్రేలియా

australia-beat-south-afrika

australia-beat-south-afrika

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 పోటీల్లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 5 వికెట్లతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. స్టీవ్ స్మిత్ (35), మార్కస్ స్టెయినీస్(24 నాటౌట్), గ్లెన్ మాక్స్ వెల్(18),  మ్యాథ్యూవెడ్(15 నాటౌట్), డెవిడ్ వార్నర్(14) రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. కగిసో రబడా, తబ్రైజ్ షమ్సీ, కేశవ్ మహారాజ్ లు చెరో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 118/9 మాత్రమే చేసింది. మారక్రమ్‌ (40) ఒక్కడే రాణించగా.. కెప్టెన్‌ టెంబా బవుమా (12), మిల్లర్‌ (16), రబాడ (19*) ఫర్వాలేదనిపించినా.. డికాక్‌ 7, డస్సెన్ 2, క్లాసెన్ 13, డేవిడ్ మిల్లర్ 16, ప్రిటోరియస్ 1, నార్జే 2 ఘోరంగా విఫలమయ్యారు. దీంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, జంపా 2, స్టార్క్ 2.. మాక్స్ వెల్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ తీశారు.