T20 World Cup 2021: విండీస్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

england-beat-west-indies

england-beat-west-indies

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ టీం ఘన విజయం సాధించింది. వెస్టిండిస్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లాండ్ టీం 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జోస్ బట్లర్( 24 నాటౌట్), జాసన్ రాయ్(11), జానీ బెయిర్‌స్టో(9), మోర్గాన్(7) రాణించగా.. మోయిన్ అలీ (3), లివింగ్ స్టోన్(1) విఫలమయ్యారు. విండిస్ బౌలర్లలో అకేల్ హోసేన్ 2, రవి రాంపాల్ ఒక వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. క్రిస్‌ గేల్‌ (13) ఒక్కడే రెండంకెల స్కోరును సాధించగా.. సిమన్స్ 3, లూయిస్ 6, హెట్‌మెయిర్‌ 9, డ్వాన్ బ్రావో 5, నికోలస్ పూరన్ 1, కీరన్‌ పొలార్డ్‌ 6, రస్సెల్‌ డకౌట్, హోసెన్ 6*, మెక్‌కీ డకౌట్‌, రవిరాంపాల్‌ 2 ఇలావచ్చి అలా వెళ్లారు. ఇంగ్లాండ్‌ బౌలర్‌ అదిల్ రషీద్‌ (4/2) పడగొట్టగా.. మిల్స్‌ 2, మొయిన్ అలీ 2, వోక్స్, జొర్డాన్ చెరో వికెట్ తీశారు.