టీ20 ప్రపంచకప్‌ 2021 వార్మప్ మ్యాచ్.. ఇంగ్లాండ్‌పై కిషన్‌, రాహుల్‌ విధ్వంసం.. భారత్‌ ఘనవిజయం

T20 World Cup 2021 warm-up match

T20 World Cup 2021 warm-up match

ఇండియా టీ20 ప్రపంచకప్‌ 2021 వార్మప్ మ్యాచ్ లో కోహ్లి బృందం అదరగొట్టింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (70 రిటైర్డ్‌ నాటౌట్‌; 46 బంతుల్లో 7×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (51; 24 బంతుల్లో 6×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. పంత్‌ (29 నాటౌట్‌; 14 బంతుల్లో 1×4, 3×6) మెరవడంతో 189 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (49; 36 బంతుల్లో 4×4, 1×6), మొయిన్‌ అలీ (43 నాటౌట్‌; 20 బంతుల్లో 4×4, 2×6), లివింగ్‌స్టోన్‌ (30; 20 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. షమి మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా   (1/26), అశ్విన్‌ (0/23) పొదుపుగా బౌలింగ్‌ చేశారు. రాహుల్‌ చాహర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.